Viral Video: పాక్‌పై భారత్ గెలుపు.. పాకిస్తానీ ఫన్నీ రియాక్షన్.. వర్షానికి పాక్ ప్రజలు కృతఙ్ఞతలు చెప్పాలట.. రీజన్ వింటే నవ్వులే నవ్వులు..
వైరల్ అయిన క్లిప్ కేవలం 11 సెకన్లు మాత్రమే ఉంది. అయితే పాకిస్థానీ తన హృదయ బాధను వెల్లడిస్తూ ఆ యువకుడు వ్యక్తం చేసిన విధానం చూస్తే ఎవరైనా నవ్వడం ప్రారంభిస్తారు. పాకిస్తాన్ ఓటమి తర్వాత ఒక యూట్యూబర్ .. ఒక యువకుడిని ఓటమి తీరు గురించి అడిగినప్పుడు ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఆ యువకుడు ఏడుస్తూ చెప్పాడు..అదృష్టం కొద్ది వర్షం వచ్చింది.
సోమవారం కొలంబో వేదికగా ప్రేమదాస స్టేడియం లో జరిగిన ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా ఓడించింది. పాకిస్థాన్‌పై భారత్ 228 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత అభిమానుల్లో ఆనందం వెల్లివిరియగా.. పొరుగు దేశ ప్రజలు మాత్రం షాక్ తిన్నారు. కాగా మ్యాచ్‌లో ఘోర పరాజయం తర్వాత తమ జట్టు ఓటమిపై ఓ పాకిస్థానీ వ్యక్తి స్పందించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో కడుపుబ్బ నవ్విస్తూ వైరల్‌గా మారింది.
వైరల్ అయిన క్లిప్ కేవలం 11 సెకన్లు మాత్రమే ఉంది. అయితే పాకిస్థానీ తన హృదయ బాధను వెల్లడిస్తూ ఆ యువకుడు వ్యక్తం చేసిన విధానం చూస్తే ఎవరైనా నవ్వడం ప్రారంభిస్తారు. పాకిస్తాన్ ఓటమి తర్వాత ఒక యూట్యూబర్ .. ఒక యువకుడిని ఓటమి తీరు గురించి అడిగినప్పుడు ఈ సన్నివేశం చోటు చేసుకుంది. ఆ యువకుడు ఏడుస్తూ చెప్పాడు..అదృష్టం కొద్ది వర్షం వచ్చింది. ఒకవేళ వర్షం రాకుండా ఉండి ఉంటె.. భారత్ ఖచ్చితంగా 500 పరుగులు కొట్టేది.. కనుక ఈ రోజు వర్షం కురిసినందుకు అందరం కృతజ్ఞతతో ఉండాలి అంటూ చెప్పాడు. ఆ యువకుడు ఏడుస్తూ చెబుతున్నప్పుడు యూట్యూబర్ యాంకర్ కూడా నవ్వుకున్నాడు.
ఈ వీడియో చూద్దాం.
” Ye to shukar kar aaj Baarish ho gayi, agar Baarish na hoti, to India ne to aaj 500 confirm hi maarna tha ” 😭😭😭😭😭😭😭😭😭
🤣 Listen to a Pakistani Fan who’s heart broke after #IndiaVsPakistan#INDvPAK #INDvsPAK #BHAvsPAK #IndiavsPak #Asiacup2023 pic.twitter.com/JJy2FAtvZL
— Bingo Bhai (@Bingo_Bhai) September 12, 2023
ఇప్పుడు ఈ పాకిస్థానీ యువకుడి వీడియో మైక్రో బ్లాగింగ్ సైట్ X (ఇంతకుముందు ట్విట్టర్) లో ఎక్కువగా వైరల్ అవుతోంది. @Bingo_Bhai హ్యాండిల్‌తో వీడియోను షేర్ చేస్తూ.. IndVsPak మ్యాచ్ తర్వాత గుండె పగిలిన పాకిస్థానీ అభిమానిని బాధ వినండి అని వినియోగదారు రాశారు.
ఈ మ్యాచ్ ఆదివారమే ముగియాల్సి ఉన్నప్పటికీ వర్షం కారణంగా మ్యాచ్‌ని రిజర్వ్ డే అంటే సోమవారానికి మార్చారు. అయితే భారత్ వర్షం పడినా తమ బ్యాటింగ్ లో లయ తప్పనివ్వలేదు. అదే ఫామ్ ని కొనసాగిస్తూ పాకిస్థాన్‌పై భారత జట్టు అద్భుతంగా బ్యాటింగ్ చేసి 356 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగులకే పాక్ జట్టు ఆల్ అవుట్ అయి ఓటమి పాలైంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..