AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో రచ్చ రచ్చ.. మీసం తిప్పిన బాలకృష్ణ.. దమ్ముంటే రావాలంటూ అంబటి సవాల్..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే.. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా.. వైసీపీ నేతలు అడ్డుకునే పని చేశారు. చంద్రబాబు ఆధారాలతో దొరికిపోయారని మంత్రి అంబటి అనగా.. వారి తీరును తప్పు పట్టారు టీడీపీ నేతలు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకుంది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే.. టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయగా.. వైసీపీ నేతలు అడ్డుకునే పని చేశారు. చంద్రబాబు ఆధారాలతో దొరికిపోయారని మంత్రి అంబటి అనగా.. వారి తీరును తప్పు పట్టారు టీడీపీ నేతలు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకుంది. చంద్రబాబు అరెస్టుపై మాట్లాడాలని, కేసులను ఎత్తివేయాలంటూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. స్పీకర్ పైకి పేపర్లు విసురుతూ టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించారు. చంద్రబాబు పై పెట్టిన కేసులు కొట్టివేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో పాటు ఇంకా చాలా అంశాలు చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న బుగ్గన స్పష్టంచేశారు. స్పీకర్ ముందున్న మానిటర్ లాగేందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రయత్నం చేశారు. టీడీపీ సభ్యులు ప్రవర్తనతో సభలో అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు కక్షసాధింపు చర్య కాదంటూ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతుండగా.. బాలకృష్ణ చేతితో సైగలు చేశారు.
బాలకృష్ణ సైగలతో వైసీపీ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. బాలకృష్ణ కు వ్యతిరేకంగా పోడియం వద్దకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. బాలకృష్ణ సినిమాల్లో మీసం తిప్పుకోవాలి.. ఇక్కడ కాదన్న మంత్రి అంబటి పేర్కొన్నారు. దమ్ముంటే రావాలంటూ బాలకృష్ణ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే, బాలకృష్ణను చూస్తూ వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తొడ గొట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో స్పీకర్ సభను వాయిదా వేస్తూ ప్రకటించారు.
అటు శాసన మండలిలోనూ చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానం కోరారు టీడీపీ సభ్యులు. అయితే వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో టీడీపీ శాసనమండలి సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని పట్టుబట్టారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. దాంతో సభలో గందరగోళం నెలకొంది. టీడీపీ సభ్యులు సహకరిస్తే చర్చకు సిద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించినా…శాంతించలేదు. దాంతో సభ కాసేపు వాయిదా పడింది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..