IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. హస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని..

ఈ మధ్యకాలంలో విద్యార్ధుల బలవన్మరణాలు మరింత ఆందోళనకరంగా మారాయి. చదువుల ఒత్తిడి చిత్తు చేయడమే అందుకు కారణం. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న లేత కుసుమాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా్యి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్ధి మరణం కలకలంగా మారింది. విద్యార్ధి తన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని..

IIIT Student Suicide: ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ విద్యార్థి ఆత్మహత్య.. హస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరిపెట్టుకుని..
Sudent Gangaram
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 20, 2023 | 6:57 AM

వేంపల్లె, సెప్టెంబర్‌ 20: ఈ మధ్యకాలంలో విద్యార్ధుల బలవన్మరణాలు మరింత ఆందోళనకరంగా మారాయి. చదువుల ఒత్తిడి చిత్తు చేయడమే అందుకు కారణం. దీంతో ఎంతో భవిష్యత్తు ఉన్న లేత కుసుమాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నా్యి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్ధి మరణం కలకలంగా మారింది. విద్యార్ధి తన హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కూలీలైన తల్లిదండ్రులు ఎండలో చాకిరీ చేసి కుమారుడిని పెద్ద చదువులు చదివిస్తూ మురిసిపోయారు. కానీ చేతికందొచ్చిన కొడుకు అర్ధాంతరంగా తనువు చాలించడంతో గుండెలవిసేలా విలపిస్తున్నారు. పోలీసులు, తోటి విద్యార్థుల కథనం ప్రకారం..

లింగాల మండలం తేర్నాంపల్లె హరిజనవాడకు చెందిన నారాయణమ్మ, గంగాధర అనే దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు గంగారాం, చిన్న కుమారుడు గౌరీకుమార్‌లు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ నారాయణమ్మ, గంగాధర దంపతులు కుమారులను చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు గంగారాం (21) వైయస్‌ఆర్‌ జిల్లా వేంపల్లె మండలం ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ మూడో ఏడాది చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ గంగారాం ట్రిపుల్‌ ఐటీలోని తన హాస్టల్‌ గదిలో మంగళవారం (సెప్టెంబర్‌ 19) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు.

హాస్టల్‌లోని తోటి విద్యార్థులు గంగారాం గది తలుపులు కొట్టినా ఎంతకూ తీయలేదు. దీంతో విద్యార్ధులు కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. హాస్టల్‌ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి మృతదేహాన్ని వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం విద్యార్ధి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌, సీఐ గోవిందరెడ్డితోపాటు తదితరులు ఆసుపత్రిలో విద్యార్థి మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్ధి గదిలో ఎటువంటి సూసైడ్‌ లెటర్‌ లభ్యంకాలేదని.. కేసు దర్యాప్తులో ఉందని మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ