Andhra Pradesh: చేప తెచ్చిన తంటా అంతా ఇంత కాదు.. ముక్క తినేందుకు పెద్ద యుద్ధమే చేసిన రైతు..
విజయనగరం జిల్లాలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేట సమీపంలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లాడు. అలా పొలం వెళ్లిన రైతు పొలంలో పనులు చేస్తుండగా మడ్డువలస రిజర్వాయర్ నుండి పొలంలోకి వస్తున్న నీటిలో ఓ పొడవాటి అరుదైన ప్రాణి వేగంగా ప్రాకుతూ వచ్చింది. ఆ ప్రాణిని చూసిన రైతు ఏదో ప్రమాదకరమైన ప్రాణి అనుకొని భయంతో పరుగులు తీశాడు. తరువాత కొంతసేపటికి తిరిగి మరోసారి నెమ్మదిగా ప్రాణి వద్దకు వచ్చాడు.

విజయనగరం జిల్లాలో ఓ రైతుకు వింత అనుభవం ఎదురైంది. సంతకవిటి మండలం శ్రీహరినాయుడు పేట సమీపంలో ఓ రైతు ఉదయాన్నే పొలం పనులకు వెళ్లాడు. అలా పొలం వెళ్లిన రైతు పొలంలో పనులు చేస్తుండగా మడ్డువలస రిజర్వాయర్ నుండి పొలంలోకి వస్తున్న నీటిలో ఓ పొడవాటి అరుదైన ప్రాణి వేగంగా ప్రాకుతూ వచ్చింది. ఆ ప్రాణిని చూసిన రైతు ఏదో ప్రమాదకరమైన ప్రాణి అనుకొని భయంతో పరుగులు తీశాడు. తరువాత కొంతసేపటికి తిరిగి మరోసారి నెమ్మదిగా ప్రాణి వద్దకు వచ్చాడు. కొంచెం సేపు టెన్సన్ తో అటూ ఇటూ తిరిగి ఏమి చేయాలో పాలుపోక భయంతో ప్రక్క పొలాల్లో ఉన్న రైతులను పెద్ద పెద్దగా కేకలు వేస్తూ పిలిచాడు. దీంతో రైతు కేకలు విన్న మిగతా రైతులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు.
అందరూ కలిసి పొలంలోనే ఆ ప్రాణి వద్దకు చేరుకొని పొడవుగా, లావుగా ఉన్న ఈ ప్రాణి అరుదైన జాతి గల పాము అని ఓ నిర్ణయానికి వచ్చారు రైతులు. దీంతో వెంటనే కర్రలతో ఆ ప్రాణిని కొట్టారు. రైతులు కొట్టిన దెబ్బలకు కదల్లేక పోయింది ఆ ప్రాణి. ఆ తరువాత అందరూ కలిసి నెమ్మదిగా ప్రాణిని కర్రతో కదిలించగా అక్కడ కనిపిస్తుంది పాము కాదని, అరుదైన చేప అని నిర్ధారణకు వచ్చారు. ఆ చేప సుమారు ఐదు అడుగుల పొడవు, ఇరవై ఆరు కేజీల బరువు ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడే రైతుకు కొత్త సమస్య వచ్చి పడింది. రైతు చేతికి దొరికిన చేపను తాము కూడా చూశామని, మడ్డువలస రిజర్వాయర్ నుండి నీటిలో కొట్టుకువచ్చింది కాబట్టి అందరికి ఆ చేపలో వాటా ఉంటుందని రైతుతో గొడవకు దిగారు మిగతా రైతులు.
ఇదెక్కడి భాధ రా నాయన.. నా పొలంలో నాకు దొరికిన చేపలో మీకెందుకు వాటా ఇవ్వాలని రైతు కూడా గొడవకు దిగాడు. గొడవ ముదిరి ఆ పంచాయితీ కాస్తా గ్రామంలోని పెద్ద మనుషుల వద్దకు చేరింది. దీంతో ఇరు వర్గాల వాదనలు విని ఎట్టకేలకు చేప రైతు పొలంలో దొరికింది కాబట్టి రైతుకు చెందిందని తీర్పు ఇచ్చారు గ్రామపెద్దలు. హమ్మయ్య నా చేప నాకు దక్కింది అని సంబరపడుతూ చేపను తీసుకొని ఇంటికి వెళ్ళాడు రైతు.




ఇదంతా ఒక ఎత్తైతే చేపతో ఇంటికి చేరిన రైతుకి మరో తంటా వచ్చి పడింది. అరుదైన చేప కాబట్టి ఆ చేప విషపూరితం అయ్యింటదని కొందరు, లేదు లేదు మడ్డువలస రిజర్వాయర్ లో పెరిగిన చేప కాబట్టి శ్రేష్టమైన చేపే అని మరికొందరు ఇలా ఎవరికి వారు చేప కోసం అనుమానాలు వ్యక్తం చేశారు గ్రామస్తులు. ఈ అనుమానాలు విన్న రైతు భార్య ఇదేదో ప్రమాదకరమైన చేపలా ఉంది, చేపకి విషం ఉంటే ఇంట్లో వారందరికీ హని కలుగుతుంది కాబట్టి నేను వండను అని అడ్డం తిరిగింది. అలా ఇంట్లో రైతు తన భార్యతో మళ్ళీ కొంతసేపు గొడవకు దిగాడు.
చివరికి రైతు గొడవతో చేసేదిలేక ఎట్టకేలకు చేపను కోసి చేపపులుసు పెట్టింది రైతు భార్య. దొరికిన చేప తినడానికి రైతు యుద్దాలు చేసినంత పని అయ్యింది. ఏదో ఒకలా దొరికిన చేపపులుసు తిని జిహ్వచాపల్యం పొందాడు రైతు. అలా చేప కథ కంచికి చేరింది. చేప కోసం రైతు పడ్డ కష్టం ఇప్పుడు చుట్టుప్రక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..