ఉక్కపోతగా ఉందని ఏసీ ఆన్ చేస్తున్నారా.? జర ఆలోచించండి.. ఇది చూస్తే కళ్లు బైర్లే.!
పాములకు ఈ మధ్య తమ అవాసాల మీద బోర్ కొట్టినట్టు ఉంది. ఊరికే.. జనావాసాల్లోకి వెళ్తే.. ఎలా ఉంటుందని అనుకున్నదే తడవుగా.. ఇళ్లల్లో, పొలాల్లో, జనాల మధ్య దర్శనమిస్తున్నాయి. ఇక అలా పాములు తమ మధ్య ప్రత్యక్షం కావడంతో.. దెబ్బకు భయబ్రాంతులకు గురవుతున్నారు మనుషులు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి.

పాములకు ఈ మధ్య తమ అవాసాల మీద బోర్ కొట్టినట్టు ఉంది. ఊరికే.. జనావాసాల్లోకి వెళ్తే.. ఎలా ఉంటుందని అనుకున్నదే తడవుగా.. ఇళ్లల్లో, పొలాల్లో, జనాల మధ్య దర్శనమిస్తున్నాయి. ఇక అలా పాములు తమ మధ్య ప్రత్యక్షం కావడంతో.. దెబ్బకు భయబ్రాంతులకు గురవుతున్నారు మనుషులు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. మనం కూడా చూస్తూనే ఉన్నాం. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆ కోవకు చెందిన ఓ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అదేంటో వింటే.. మీరు కచ్చితంగా గజగజ వణికిపోవడం ఖాయం.
మీరు మీ ఇంట్లోని ఏసీ వాడటం మానేశారా.? అయితే దాన్ని తిరిగి వాడే సమయంలో జాగ్రత్తగా పరీక్షించండి. ఏసీలో పాములుంటాయి తస్మాత్ జాగ్రత్త. ఇదేంది.! ఇలా కూడా జరుగుతాయా.? ఏసీలో పాములు ఎందుకుంటాయని అనుకుంటున్నారా..? అవునండీ ఇది నిజమే.. ఇటీవల కాలంలో ఏసీల్లో పాములు తలదాచుకుంటున్న విచిత్ర ఉదంతాలు అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి మరో ఉదంతమే ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. తాజాగా ఓ ఇంట్లోని ఏసీలో ఐదడుగుల పాము కనిపించడంతో ఆ కుటుంబ సభ్యులు వణికిపోయారు. దెబ్బకు స్నేక్ క్యాచర్‌ను ఆశ్రయించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం క్రిష్టంపల్లి గ్రామంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సురేష్ అనే వ్యక్తి ఇంటిలో ఐదు అడుగులకు పైగా ఉన్న ఓ పాము హల్చల్ చేసింది. ఇంటిలోని ఏసీలో పాము దూరి ఉన్న విషయాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. గత కొద్దిరోజులుగా సురేష్ ఏసీని వినియోగించడం లేదు. ఎండలు తగ్గాయన్న ఉద్దేశ్యంతో గత నెల రోజులుగా సురేష్ ఏసీ వాడకుండా ఆపేశాడు. అయితే మళ్లీ గత వారం రోజులుగా ఎండలు మండిపోతుండటంతో ఏసీ వేద్దామని ఆన్ చేశాడు. అంతే అప్పటివరకు ఏసీలో చల్లగా కునుకు తీస్తున్న పాము ఒక్కసారిగా ఏసీ వింగ్స్ నుంచి బయటకు వచ్చేసంది. ఏసీలో నుంచి చల్లగాలి వస్తుందని ఎదరుచూసిన సురేష్ కుటుంబ సభ్యులకు అనుకోని అతిధిలా ఏసీ నుంచి పాము బయటకు రావడంతో ఖంగుతిన్నారు. పామును చూసిన సురేష్ కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఏసీ నుంచి బయటకు వచ్చిన పాము కిటికీ నుంచి బయటకు పరుగు తీసింది. దీంతో సురేష్ కుటుంబ సభ్యులు దెబ్బకు ఊపిరి పీల్చుకున్నారు. మరి మీరు కూడా ఓసారి ఏసీ తిరిగి ఆన్-చేసేటప్పుడు జర జాగ్రత్త సుమీ..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..