Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu Arrest: ‘అక్రమాలకు పాల్పడ్డారు’.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు విచారణ..

Amaravati Inner Ring Road case: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు.. ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఇది. అమరావతి నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టామని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్తుంటే.. అందులో పెద్ద మతలబు ఉందంటోంది సీఐడీ. అయితే.. రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ పేర్కొంటుంది..

Chandrababu Arrest: ‘అక్రమాలకు పాల్పడ్డారు’.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు విచారణ..
Chandrababu
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 20, 2023 | 8:33 AM

Amaravati Inner Ring Road case: అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు.. ఏపీ నూతన రాజధాని నిర్మాణంలో భాగంగా గత ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఇది. అమరావతి నగర భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టామని అప్పటి టీడీపీ ప్రభుత్వం చెప్తుంటే.. అందులో పెద్ద మతలబు ఉందంటోంది సీఐడీ. అయితే.. రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీ పేర్కొంటుంది.. ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలకం రేపుతోంది. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్‌ భూములను కొల్లగొట్టారన్న అభియోగాలు మోపింది. సీఆర్‌డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ రూపొందించారు. మొదటి అలైన్‌మెంట్‌ ప్రకారం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది.

చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరగదనే ఉద్దేశంతో సీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి చేసి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో మార్పులు చేశారన్నది అధికారుల అభియోగం. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. దక్షిణానికి జరపడంతో హెరిటేజ్‌ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజలలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నిర్మించేలా 97 కి.మీ. మేర అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి సింగపూర్‌కు చెందిన కన్సల్టెన్సీని రంగంలోకి తీసుకొచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది.

మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా 50 లక్షలు. అయితే ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ తర్వాత.. రిజిస్టర్‌ విలువే నాలుగున్నర రెట్లు పెరిగింది. మార్కెట్‌ ధర ప్రకారం ఎకరా 2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్‌ ధర ప్రకారం అమాంతం 887.50 కోట్లకు పెరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణం పూర్తయితే ఎకరా విలువ సీడ్‌ క్యాపిటల్‌ ప్రాంతంలో 4 కోట్లకు చేరుతుందని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ రూపకల్పన.. కన్సల్టెన్సీ మాయాజాలం.. అసైన్డ్ భూముల వ్యవహారం.. క్విడ్ ప్రోకో ఎపిసోడ్‌ మొత్తాన్ని బయటకు లాగాలని భావిస్తోంది సీఐడీ. ఇందులో భాగంగానే విజయవాడ ఏసీబీ కోర్ట్‌ లో చంద్రబాబుపై పీటీ వారెంట్‌ దాఖలు చేసింది.

ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో నిన్న విచారణకు వచ్చింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు వెల్లడించింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..