TS TET 2023 Answer Key: తెలంగాణ టెట్‌ ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ప్రైమరీ ఆన్సర్‌ కీ విడుదలయ్యింది. ఈ నెల 15వ తేదీన జరిగిన టెట్‌ పేపర్‌-1, 2 పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ప్రాథమిక కీపై ఆన్‌లైన్‌లో వచ్చిన అభ్యంతరాలను మాత్రమే స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 23వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ కన్వీనర్ వెల్లడించారు. అభ్యంతరాల స్వీకరణకు సంబంధించిన లింక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో..

TS TET 2023 Answer Key: తెలంగాణ టెట్‌ ప్రాథమిక ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఇక్కడ నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోండి
TS TET 2023 Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 21, 2023 | 7:44 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21: తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2023 ప్రైమరీ ఆన్సర్‌ కీ విడుదలయ్యింది. ఈ నెల 15వ తేదీన జరిగిన టెట్‌ పేపర్‌-1, 2 పరీక్షల ప్రాథమిక ఆన్సర్‌ కీలు వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ప్రాథమిక కీపై ఆన్‌లైన్‌లో వచ్చిన అభ్యంతరాలను మాత్రమే స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 23వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ కన్వీనర్ వెల్లడించారు. అభ్యంతరాల స్వీకరణకు సంబంధించిన లింక్‌ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. టెట్‌ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు సంబంధిత వివరాలతో లాగిన్‌ అయ్యి తమ ఆన్సర్‌ షీట్లు, ఆన్సర్‌ కీతోపాటు మాస్టర్ ప్రశ్నాపత్రాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. సమర్పించిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెల్లడి కానున్నాయి.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబ‌రు 15న‌ టెట్‌ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పేపర్‌ 1కు 1,139 పరీక్ష కేంద్రాలు, పేపర్ 2కు 913 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పేపర్‌-1కు 84.12 శాతం మంది హాజరుకాగా పేపర్‌-2కు మొత్తం 91.11 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. పేపర్‌ 1 పరీక్షకు మొత్తం 2,69,557 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 2,26,744 మంది మాత్రమే పరీక్ష రాశారు. టెట్‌ పరీక్ష ఫలితాలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నట్లు ముందే స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువు సొంతం చేసుకోవాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ) రాయడానికి అర్హులుగా విద్యాశాఖ ఎంచుతుంది.

తెలంగాణ టెట్‌ 2023 పేపర్‌-1 ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

తెలంగాణ టెట్‌ 2023 పేపర్‌-2 (మ్యాథ్స్‌/సైన్స్‌) ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి.

తెలంగాణ టెట్‌ 2023 పేపర్‌-2 (సోషల్‌ స్టడీస్‌) ప్రాథమిక కీ కోసం క్లిక్‌ చేయండి.

SSC GD Constable తుది మార్కుల జాబితా వెల్లడి

కేంద్ర సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ) పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 20న తుది మార్కుల జాబితాను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నెంబర్, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేసి మార్కులను చెక్‌ చేసుకోవచ్చు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ పోస్టుల్లో పీఈటీ/పీఎస్‌టీ ఫలితాలు జులైలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.