Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS DSC 2023 Exam Dates: తెలంగాణ టీఆర్‌టీ 2023 పరీక్షల తేదీలు ఇవే.. ఏ రోజున ఏయే పరీక్ష ఉందంటే..

తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్ర నిరుద్యోగులు ప్రస్తుతం ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. డీఎస్సీ ద్వారా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 11 రోజులపాటు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటిల్లో ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ) పోస్టులకు ఆన్‌లైన్ పరీక్షలు ఆరు రోజులపాటు..

TS DSC 2023 Exam Dates: తెలంగాణ టీఆర్‌టీ 2023 పరీక్షల తేదీలు ఇవే.. ఏ రోజున ఏయే పరీక్ష ఉందంటే..
TS DSC 2023 Exam Dates
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 21, 2023 | 11:50 AM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21: తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నోటిఫికేషన్‌ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఈ ప్రకటన వెలువడింది. రాష్ట్ర నిరుద్యోగులు ప్రస్తుతం ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. డీఎస్సీ ద్వారా ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నవంబరు 20 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 11 రోజులపాటు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వీటిల్లో ప్రాథమిక పాఠశాలల్లో బోధించే సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్‌జీటీ) పోస్టులకు ఆన్‌లైన్ పరీక్షలు ఆరు రోజులపాటు నిర్వహిస్తారు. అలాగూ ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతులకు బోధించే స్కూల్‌ అసిస్టెంట్ల ( ఎస్‌ఏ) పోస్టులకు మూడు రోజులపాటు పరీక్షలు జరుగుతాయి. పీఈటీలు, భాషా పండితులకు ఒక్కో రోజు ఒక్కో పరీక్ష ఉంటుంది. ఈ మేరకు పరీక్షల తేదీల షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది.

ఇక తెలంగాణ టీఆర్‌టీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ బుధవారం (సెప్టెంబర్ 20) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు అక్టోబరు 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అభ్యర్ధులు గరిష్ఠ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. నియామక పరీక్షలు రోజుకు రెండు విడతల చొప్పున జరగనున్నాయి. తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఈ మేరకు రోజుకు రెండు విడతల చొప్పున పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉంటుంది. రెండో సెషన్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటలకు వరకు ఉంటుంది.

కాగా 2017లో టీఆర్టీ పరీక్షను సుమారు 2.50 లక్షల మంది రాశారు. ఈ సారి దరఖాస్తుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని సబ్జెక్టులకే ఉద్యోగ ప్రకటన వెలువడటంతో అనేక సబ్జెక్టులకు ఖాళీలు లేకపోవడంతోపాటు మరికొన్నింటికి తక్కువగా పోస్టులు ఉండటం ఇందుకు కారణం. 16 జిల్లాల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ గణితం పోస్టులు ఒక్కటి కూడా లేవు. 7 జిల్లాల్లో ఇంగ్లిష్‌ పోస్టులు, 3 జిల్లాల్లో ఫిజిక్స్‌, 2 జిల్లాల్లో సోషల్‌ సైన్సెస్‌ పోస్టులు అసలు లేవు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ టీఆర్టీ 2023 పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

  • ఎస్‌ఏ భాషేతర సబ్జెక్టుల పరీక్ష తేదీలు: నవంబర్‌ 20, 21
  • ఎస్‌ఏ భాషా సబ్జెక్టుల పరీక్ష తేదీలు: నవంబర్‌ 20
  • పీఈటీ అన్ని భాషలకు పరీక్ష తేదీలు: నవంబర్‌ 23
  • భాషా పండితుల సబ్జెక్టుల పరీక్ష తేదీలు: నవంబర్‌ 24
  • ఎస్‌జీటీ పోస్టులకు పరీక్ష తేదీలు: నవంబర్‌ 25 నుంచి 30 వరకు

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
గాల్లో ఉండగానే పైలట్‌కు గుండెపోటు..విమానంలో ప్రయాణికులు వీడియో
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
బ్రిటిషర్లను భయపెట్టిన రోటీ.. చరిత్రను మలుపుతిప్పిన చపాతీ ఉద్యమం.
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
అమెరికన్లపై చైనీయుల మీమ్స్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
రూ. 300 కోట్ల బంగ్లా.. లగ్జరీ కార్లు..వావ్‌ వాటే లైఫ్‌ వీడియో
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
అయ్యో చేప ఎంతపని చేసింది.. వీడియోలో మీరే చూడండి!
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
దూసుకెళ్తున్ బస్సు..భయం భయంగా ప్రయాణికులు..ఏం జరిగిందంటే.. వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
రెస్టారెంట్‌ వింత ఆఫర్‌.. ఎంత బక్కగా ఉంటే అంత డిస్కౌంట్ వీడియో
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
మైక్రోసాఫ్ట్‌ బాస్‌లను ప్రశ్నించి..రచ్చ చేసిన మహిళ .. ఎందుకంటే..
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
ఫై ఓవర్‌ నుంచి ఊడిపడ్డ కాంక్రీట్‌ బీమ్‌ ..కారులోకి చొచ్చుకెళ్లి బ
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో
నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా? వీడియో