NEET PG 3rd Round Counselling 2023: నీట్ పీజీ కటాఫ్ తొలగింపు… పరీక్షకు హాజరై ఉంటే చాలు సీటు గ్యారెంటీ!
నీట్ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్ సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను పూర్తిగా ఎత్తివేసింది. అంటే సున్నా మార్కులొచ్చినా సీట్లు పొందొచ్చన్నమాట. ఈ నిబంధన అన్ని కేటగిరీలకు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు నీట్ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను తొలగించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడో రౌండ్‌లో పీజీ సీట్ల కోసం కొత్తగా..
హైదరాబాద్, సెప్టెంబర్ 21: నీట్ పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో మూడో రౌండ్ సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రౌండ్ కౌన్సెలింగ్‌లో సీట్ల భర్తీకి అర్హత మార్కులను పూర్తిగా ఎత్తివేసింది. అంటే సున్నా మార్కులొచ్చినా సీట్లు పొందొచ్చన్నమాట. ఈ నిబంధన అన్ని కేటగిరీలకు వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు నీట్ మూడో రౌండ్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ మార్కులను తొలగించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడో రౌండ్‌లో పీజీ సీట్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎంసీసీ తన ప్రకటనలో పేర్కొంది.
మూడో రౌండ్ కౌన్సెలింగ్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆప్షన్లను మార్చుకుంటే సరిపోతుందని సూచించింది. కటాఫ్ తొలగించిన కారణంగానే మూడో రౌండ్‌లో సీట్ల కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించామని, ఈ అవకాశాన్ని విద్యార్ధులు సద్వినియోగ పరచుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ నిర్ణయం మేరకు అర్హత మార్కులను సున్నాకు తగ్గించినట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ తెల్పింది.
కాగా 2023-24 విద్యాసంవత్సరంలో నీట్ పీజీ కౌన్సెలింగ్‌కు కటాఫ్ మార్కులను జనరల్ కేటగిరీకి 291గా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 257 మార్కులు, దివ్యాంగులకు 274 మార్కులుగా ఎంసీసీ పేర్కొంది. ఆ ప్రకారంగానే మొదటి, రెండు రౌండ్ కౌన్సెలింగ్‌లలో కన్వీనర్ కోటాలో సీట్లు భర్తీ చేశారు. మూడో రౌండ్‌కు తాజాగా అన్ని కేటగిరీల్లో సున్నా మార్కులు అర్హతగా నిబంధనలు మార్చారు. అంటే నీట్ పీజీ పరీక్షకు హాజరై ఉంటే చాలు ఎన్నిమార్కులొచ్చినా సీటు పొందొచ్చన్నమాట. మూడో రౌండ్‌కు 13 వేలకు పైగా మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఉన్న మెడికాల్ కాలేజీల్లో కొన్ని పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంలేదని అంటున్నారు. పారాక్లినికల్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్త్రీతో సహా పలు పీజీ కోర్సుల సీట్లు ఒక్కటి కూడా భర్తీకాకుండా ఖాళీగా ఉంటున్నాయని నిపుణులు అంటున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రెండు రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత మూడో రౌండ్‌కు భారీగా సీట్లు మిగిలిపోయాయి. తాజాగా ఎంసీసీ కటాఫ్ తొలగించడంతో మిగిలిన సీట్లు కూడా భర్తీ అవుతాయో లేదో చూడాల్సిందే.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.