AP PECET 2023 Counselling: ఏపీ పీఈసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాయామ కాలేజీల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ బుధవారం (సెప్టెంబర్ 20) విడుదలైంది. ఈ మేరకు ఏపీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ ఆచార్య పాల్‌కుమార్ విడుదల చేశారు. ఏపీ పీఈసెట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు నేటి నుంచి అంటే సెప్టెంబరు 21 నుంచి అన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సిందిగా ఆయన సూచించారు. అన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ..
అమరావతి, సెప్టెంబర్ 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాయామ కాలేజీల్లో బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ బుధవారం (సెప్టెంబర్ 20) విడుదలైంది. ఈ మేరకు ఏపీ పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ ఆచార్య పాల్‌కుమార్ విడుదల చేశారు. ఏపీ పీఈసెట్ 2023లో అర్హత సాధించిన అభ్యర్థులు నేటి నుంచి అంటే సెప్టెంబరు 21 నుంచి అన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవల్సిందిగా ఆయన సూచించారు. అన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 23 వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు. రిజిస్ట్రేషన్ సమయంలో జనరల్, బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.500 ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుందని వివరించారు. సెప్టెంబరు 26 నుంచి సెప్టెంబరు 28 వరకు కాలేజీల ఎంపిక ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని తెలిపారు. సెప్టెంబరు 29వ తేదీన దరఖాస్తులో మార్పులు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌లో సీట్లు సాధించిన విద్యార్థులు అక్టోబరు 3 నుంచి 7వ తేదీల మధ్య సంబంధిత కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
నవోదయ విద్యాలయాల్లో లేటరల్ ఎంట్రీ 2024 నోటిఫికేషన్ విడుదల
దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 650 జవహర్ నవోదయ విద్యాలయా (జేఎన్‌వీ)ల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి లేటరల్ ఎంట్రీ కింద ప్రవేశాలు కల్పించడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష 2024కు దరఖాస్తులు కోరుతోంది. ఈ మేరకు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష హిందీ, ఇంగ్లిష్, తెలుగు మూడు భాషల్లో ఉంటుందని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీలు) ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు పొందిన విద్యార్ధులకు ఆయా జవహర్ నవోదయ విద్యాలయాలో విద్యార్థులకు ఉచిత విద్యతోపాటు వసతి, పుస్తకాలు అందిస్తారు. బాలికలకు, బాలురకు వేర్వేరు వసతి సౌకర్యాలు ఉంటాయి. ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అక్టోబర్ 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష వచ్చే ఏడాది అంటే 2024, ఫిబ్రవరి 10న నిర్వహించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.