TSPSC AEE 2023 Results: తెలంగాణ ఏఈఈ 2023 మెరిట్‌ జాబితా విడుదల.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి..

తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్‌టీ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబ‌రు 20న‌ టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల మెరిట్‌ జాబితాను సబ్జెక్టు వారీగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోఅందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ..

TSPSC AEE 2023 Results: తెలంగాణ ఏఈఈ 2023 మెరిట్‌ జాబితా విడుదల.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి..
TSPSC AEE Results 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 21, 2023 | 2:10 PM

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 21: తెలంగాణ రాష్ట్రంలోని 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్‌టీ విధానంలో రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను సెప్టెంబ‌రు 20న‌ టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల మెరిట్‌ జాబితాను సబ్జెక్టు వారీగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో  అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు తమ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగాల్లో మొత్తం 1540 ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, సివిల్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ పరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్‌ కీని ఇప్పటికే కమిషన్‌ విడుదల చేయగా.. తాజాగా సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. అర్హులైన అభ్యర్థులను 1 : 2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు పిలవనుంది. అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 857 మందిని, సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 27,145 మందిని, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 10,948 మందిని, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో 7,726 మందిని మెరిట్‌ జాబితాలో ఇచ్చింది.

గురుకుల టీజీటీ పోస్టులకు సెప్టెంబ‌రు 21 నుంచి 30వరకు ఆప్షన్ల నమోదు

తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌, స్కూల్‌ లైబ్రేరియన్లు, పీడీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కంప్యూటర్‌ ఆధారిత నియామక పరీక్షలు కూడా పూర్తి చేసింది. ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు గురుకుల సొసైటీలు, జోన్ల వారీగా ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవల్సిందిగా తెలంగాణ గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు కన్వీనర్‌ మల్లయ్యబట్టు ఓ ప్రకటనలో తెలిపారు. టీజీటీ పోస్టులకు సెప్టెంబ‌రు 21వ తేదీ నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. మిగతా పోస్టులకు అక్టోబరు 3 నుంచి 9వ తేదీ వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో 434 స్టాఫ్‌నర్సు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఒప్పంద విధానంలో 434 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీ దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం పోస్టుల్లో 68 పోస్టులను వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. జనరల్‌ నర్సింగ్‌ అండ్‌ మిడ్‌వైఫరీ లేదా బీఎసీ నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్ధులు వెరైనా సెప్టెంబ‌రు 21 నుంచి అక్టోబ‌రు 5 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.