AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TREIRB Gurukula Jobs: కీలకంగా మారనున్న ఆప్షన్ల నమోదు ప్రక్రియ.. ఒక్క ఆప్షన్‌ వదిలేసినా అవకాశం చేజారినట్లే!

రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఆప్షన్ల నమోదులో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ గురుకుల నియామక బోర్డు సూచిస్తోంది. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ) పోస్టులకు సెప్టెంబర్‌ 21 నుంచి 30 వరకు, పాఠశాల లైబ్రేరియన్ పోస్టులకు అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు, మిగిలిన ఫిజికల్‌ డైరెక్టర్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విధిగా జోన్లు, సొసైటీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో..

TREIRB Gurukula Jobs: కీలకంగా మారనున్న ఆప్షన్ల నమోదు ప్రక్రియ.. ఒక్క ఆప్షన్‌ వదిలేసినా అవకాశం చేజారినట్లే!
TREIRB Gurukula Jobs
Srilakshmi C
|

Updated on: Sep 22, 2023 | 12:58 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 22: రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ గురుకులాల్లో 9,210 ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఆప్షన్ల నమోదులో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటూ గురుకుల నియామక బోర్డు సూచిస్తోంది. ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ (టీజీటీ) పోస్టులకు సెప్టెంబర్‌ 21 నుంచి 30 వరకు, పాఠశాల లైబ్రేరియన్ పోస్టులకు అక్టోబర్‌ 3 నుంచి 9 వరకు, మిగిలిన ఫిజికల్‌ డైరెక్టర్, డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు విధిగా జోన్లు, సొసైటీల వారీగా ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు ఇచ్చుకోవాలని గురుకుల బోర్డు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతి ఆప్షన్‌ను తప్పకుండా ఎంపిక చేసుకోవాలని, అప్పుడే ఉద్యోగం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఏ ఒక్క ఆప్షన్‌ నమోదు చేసుకోకపోయినా ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. జోన్ల వారీగా అర్హత మార్కుల్లో తేడాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఆప్షన్‌ విలువైనదేనని స్పష్టం చేశారు.

ప్రతి ఆప్షన్‌ విలువైనదే..

కాగా రాష్ట్రంలోని ప్రస్తుతం 5 గురుకుల సొసైటీల పరిధిలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. అయితే ఏడు జోన్ల పరిధిలోని ఉద్యోగాలకు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి అభ్యర్థి గరిష్టంగా ప్రాధాన్యతా క్రమంలో 35 ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. సరైన విధంగా వాటిని ఎంపిక చేసుకుంటూ ఆప్షన్‌ ఇచ్చుకుంటూ వెళ్లాలి. మహిళా అభ్యర్థులకు అదనంగా బాలికల విద్యా సంస్థల కేటగిరీ ఉండటం వల్ల వీరి ఆప్షన్ల నమోదులో మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు ఏకంగా 70 ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మల్టీజోనల్‌ స్థాయిలోని డిగ్రీ లెక్చరర్, జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తు సమయంలోనే తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఆప్షన్లు స్వీకరించింది. జోనల్‌ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మాత్రం ఇప్పుడు ఆప్షన్లు ఇవ్వవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కేటగిరీల వారీగా మెరిట్‌ జాబితాలను టీఆర్‌ఈఐఆర్‌బీ విడుదల చేయనుంది.

అప్పుడే గురుకుల ఫలితాలు వచ్చేది..

ప్రస్తుతం కాలేజీ విద్య కమిషనరేట్, ఇంటర్‌ బోర్డు పరిధిలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్‌ లెక్చరర్లకు సంబంధించి టీఎస్‌పీఎస్సీ అర్హత పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షలు పూర్తయ్యాక ప్రాథమిక మెరిట్‌ జాబితాలను విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది. వచ్చేనెల మొదటి వారం నాటికి టీఎస్‌పీఎస్సీ పరీక్షలు పూర్తవుతాయి. ఆ తర్వాతనే గురుకుల బోర్డు మెరిట్‌ జాబితాలను విడుదల చేసే అవకాశం ఉంది. గురుకుల పోస్టుల్లో ముందుగా డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల జాబితా విడుదల చేస్తారు. వీటికి డెమో పరీక్షలు నిర్వహించిన తర్వాత తుది మెరిట్‌ జాబితా ప్రకటిస్తారు. జూనియర్‌ లెక్చరర్‌ డెమో పరీక్షల అనంతరం పీజీటీ, టీజీటీ తదితర కేటగిరీలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us