వారెవ్వా… ఈ పెంపుడు తాబేలు భలే తెలివైనది గురూ..! సినిమాలు చూస్తుంది.. వ్రతాలు కూడా చేస్తుంది..

మామూలుగా మనుషులు తినే ఆహారం తాబేలు కూడా తింటుందని, అయితే అవి తినడం వల్ల వాటి శరీరంపై ఉన్న షెల్ వీకై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున డాక్టర్ల సలహాతో ఆన్లైన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తాబేలుకు పెడుతున్నామన్నారు. అయితే, అది భూమి మీద ఉన్నప్పుడు మాత్రం ఆహారం తీసుకోదు. నీళ్లలో ఉన్నప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకుంటుంది. దానికి ఆహారం అందించేటప్పుడు దానిని నీళ్ళల్లో వేసి తాబేలుకు కావలసిన ఆహారాన్ని నీళ్లలో వేస్తారు. అది ఆహారం తినటం పూర్తయిన తర్వాత తిరిగి నేల మీద వదులుతారు.

వారెవ్వా... ఈ పెంపుడు తాబేలు భలే తెలివైనది గురూ..! సినిమాలు చూస్తుంది.. వ్రతాలు కూడా చేస్తుంది..
Pet Tortoise
Follow us
B Ravi Kumar

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 20, 2023 | 5:30 PM

ఏలూరు, సెప్టెంబర్‌20: మూగజీవాలను ప్రేమించే వారు తమ కిష్టమైన పక్షులను, జంతువులను పెంచుకుంటారు. తమ కుటుంబ సభ్యుల్లా వాటిని సాకుతారు. అయితే ఉభయచరమైన తాబేలును పెంచటం చాలా కష్టం.వీటి పోషణ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా తాబేలు జరం. ఇది నీటిలోనూ, నేలపైనా జీవించగలదు. ఇలాంటి దాన్ని పెంచాలంటే చాలా ఓపిక కావాలి. అయితే కుక్క, నెమలి, పావురం, కోడి ఇలాంటి వాటిని మచ్చిక చేసుకొని వాటిని తాను చెప్పినట్లు వినేలా చేసుకోవటం చూశాం కానీ ఏలూరులో ఒక వ్యక్తికి తాబేలు అంటే మక్కువ వాటిని పెంచుకోవటం అంటే పిచ్చ ఇష్టం. అందుకే అవి సైతం అతను చెప్పినట్లే వింటాయి. ఏలూరుకు చెందిన భాస్కరరావుకు చిన్నతనం నుంచి పెంపుడు జంతువుల పెంపకం పట్ల చాలా ఆసక్తి ఉండేది. ఆ క్రమంలోనే ఆయనకు తాబేళ్లను పెంచడం అంటే హాబీగా చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇప్పుడు ఓ తాబేలును పెంచుతున్నారు. ఆ తాబేలు వారందరితో పాటు కలిసిపోయి కుటుంబ సభ్యులలో ఒకరిలా జీవిస్తుంది. దానికి సుమారు మూడు సంవత్సరాల వయసు. వారు ఎక్కడికి వెళ్లినా ఇంటిలో వారి వెనుకనే తిరుగుతూ సందడి చేస్తుంది. కొత్త వారు ఎవరైనా ఇంటికి వస్తే వారిని వెంటనే గుర్తిస్తుంది. అయితే భాస్కర్ రావు ఇప్పటివరకు మూడు తాబేళ్లను పెంచారు. అందులో ఒకటి 25 సంవత్సరాలు బ్రతికింది. మరొకటి 11 సంవత్సరాలు బతికింది. ప్రస్తుతం ఇప్పుడు పెంచుతున్న తాబేలు కి మూడవ సంవత్సరం.

వ్రతకథలను సైతం ఆలకించేది..

మోటు అంటూ ముద్దుగా పిలుస్తూ పెంచుకున్న తాబేలు ఆయన ఇంట్లో 11 సంవత్సరాలు పెరిగింది. ఇది చాలా ప్రత్యేకంగా ఉండేది. మోటు వారికి వరలక్ష్మీ వ్రతం రోజున దొరకడంతో దానిని ఎంతో అదృష్టంగా భావించారు. వారు ఎక్కడికి వెళ్ళినా మోటును వెంట తీసుకెళ్లేవారు. అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా మోటు పాల్గొంది. అంతేకాకుండా వ్రత కథను చాలా చక్కగా వినేది. అలాగే లాప్టాప్, టీవీలో సినిమాలు సైతం వారితో కలిసి చూసేది. రమ్మంటే వచ్చేది వెళ్ళమంటే వెళ్ళిపోయేది. మనుషుల మాటలను అర్థం చేసుకునేది. మోటు మాంసాహారం ఇష్టంగా తినేది. చికెన్, మటన్ ఇడ్లీ , దోశ లను భాస్కరరావు కుటుంబ సభ్యులతో పాటు కలిసి తినేది. అయితే మోటు 11 సంవత్సరాలు బ్రతికి చనిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మూడు సంవత్సరాలుగా మరొ తాబేలును పెంచుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇది అన్ని నేర్చుకుంటుందని భాస్కర్ రావు చెబుతున్నారు.

మామూలుగా మనుషులు తినే ఆహారం తాబేలు కూడా తింటుందని, అయితే అవి తినడం వల్ల వాటి శరీరంపై ఉన్న షెల్ వీకై అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నందున డాక్టర్ల సలహాతో ఆన్లైన్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తాబేలుకు పెడుతున్నామన్నారు. అయితే, అది భూమి మీద ఉన్నప్పుడు మాత్రం ఆహారం తీసుకోదు. నీళ్లలో ఉన్నప్పుడు మాత్రమే ఆహారాన్ని తీసుకుంటుంది. దానికి ఆహారం అందించేటప్పుడు దానిని నీళ్ళల్లో వేసి తాబేలుకు కావలసిన ఆహారాన్ని నీళ్లలో వేస్తారు. అది ఆహారం తినటం పూర్తయిన తర్వాత తిరిగి నేల మీద వదులుతారు. అయితే ఈ తాబేలుకి సాధారణ తాబేళ్ల లాగా నోట్లో నాలుక ఉండదు. ఇది టర్టిల్ జాతికి చెందిన తాబేలు.

ఇవి కూడా చదవండి

సాధారణంగా మనం తాబేల్ని టార్టాయిస్ అంటాం… కానీ తాబేళ్లన్ని టార్టాయిస్లు కావు. వాటిలో అనేక రకాలు ఉన్నాయి. అయితే టర్టిల్ సముద్ర తాబేళ్ల కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. దీనిపై వున్న చర్మం టార్టాయిస్ తో పోల్చుకుంటే చాలా పలుచగా ఉంటుంది. ఇలా పెంపుడు జంతువుల పెంపకం పట్ల ఉన్న కారణంగానే తాబేళ్ళను పెంచుతున్నామని భాస్కరరావు అంటున్నారు. అలాగే గతంలో రెండు ఉడతలను సైతం పెంచానని ఆయన చెబుతున్నారు. మోటు లాగా త్వరలోనే ఈ తాబేలు కూడా అన్ని నేర్చుకుంటుందని, ఇప్పటికే చాలావరకు దానికి నేర్పామని ఆయన అంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
తల్లికాబోతున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
ఇటువంటి కలలు కనిపిస్తే వ్యాధులు, కష్టాలు రానున్నాయని హెచ్చరిక..
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
BSNL కస్టమర్లకు శుభవార్త.. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
హనీరోజ్ ఫిర్యాదుతో 27 మందిపై కేసు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు..
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
డొనాల్డ్ ట్రంప్ జీవిత విశేషాలతో అద్భుత కళాఖండం..!
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో తెలంగాణ హైకోర్టులో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
ఇందిరా గాంధీగా కంగనా రనౌత్.. ఎమర్జెన్సీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
మరో భార్య భాదితుడు బలి.. కన్నీరు పెట్టిస్తోన్న ఆఖరి మాటలు..
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!