Biggest Cucumber: ప్రపంచంలోనే అతిపెద్ద దోసకాయ.. దీనిని కట్ చేస్తే వివాహపు విందులో ఆహుతులు మొత్తం తినొచ్చు…
వోర్సెస్టర్‌షైర్‌లోని మాల్వెర్న్‌లో జరుగుతున్న UK నేషనల్ జెయింట్ వెజిటబుల్స్ ఛాంపియన్‌షిప్‌కు వృత్తిరీత్యా తోటమాలి అయిన విన్స్ ఒక దోసకాయను తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఆ దోసకాయను చూసి షాక్ తిన్నారు. దోసకాయ 4 అడుగుల పొడవు ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోసకాయగా అభివర్ణించబడుతోంది.
ప్రపంచంలో అనేక వింత విశేషాలు జరుగుతూనే ఉంటాయి.. కొన్ని వింతలు ప్రజలను ఆలోచించేలా చేస్తాయి. మరికొన్ని ఆకట్టుకుంటాయి. కూరగాయల్లో ఒకటి దోసకాయ. మన దేశంలో దోసకాయను కూర చేయడానికి మాత్రమే కాదు పచ్చడి, సలాడ్ వంటి వాటిని చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువమంది ఈ దోసకాయను సాధారణంగా సలాడ్‌గా ఉపయోగిస్తారు. అయితే సర్వసాధారణంగా దోసకాయ బరువు సాధారణంగా 250 నుండి 300 గ్రాములు మాత్రమే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఒక దోసకాయ భారీ సైజ్ తో వార్తలలో నిలిచింది. దీని బరువు ప్రజలను ఆశ్చర్యపరిచింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదైన, బరువైన దోసకాయ. ఈ దోసకాయను కట్ చేస్తే వివాహపు విందులో వచ్చే ఆహుతులు మొత్తం తినవచ్చు. అంటే దోసకాయ ఎంత పెద్దదిగా .. ఎంత భారీగా ఉందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు.
ఈ పెద్ద దోసకాయను ఓ తోటమాలి పెంచారు. అతని పేరు విన్స్ స్జోడిన్. 50 ఏళ్ల విన్స్ ఎంతో కష్టపడి ఒక దోసకాయను పెంచాడు. దీని 30 పౌండ్లు.. అంటే 13.60 కిలోల బరువున్న ఒక దోసకాయ పండించాడని తెలిసి అందరూ షాక్ తింటున్నారు. ఎందుకంటే పొలంలో తాము పండించే కూరగాయలు మంచి నాణ్యత గలవిగా ఉండలని భారీ సైజులో ఉండలని ఎవరైనా కలలు కంటారు.
భారీ దోసకాయ
డైలీ మెయిల్ నివేదిక ప్రకారం వోర్సెస్టర్‌షైర్‌లోని మాల్వెర్న్‌లో జరుగుతున్న UK నేషనల్ జెయింట్ వెజిటబుల్స్ ఛాంపియన్‌షిప్‌కు వృత్తిరీత్యా తోటమాలి అయిన విన్స్ ఒక దోసకాయను తీసుకుని వచ్చాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు ఆ దోసకాయను చూసి షాక్ తిన్నారు. దోసకాయ 4 అడుగుల పొడవు ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోసకాయగా అభివర్ణించబడుతోంది. ఇంత పెద్ద దోసకాయను ఇప్పటివరకు ఎవరూ పండించలేకపోయారు. అటువంటి పరిస్థితిలో ఇది చరిత్రలో అతిపెద్ద దోసకాయగా నిలిచింది.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు
ఈ దోసకాయ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంత పెద్ద దోసకాయను పెంచడం అంత సులభం కాదని.. చాలా కష్టపడాల్సి వచ్చిందని విన్స్ చెప్పారు. తీగకు కాసిన దోసకాయ బరువును తట్టుకోగలిగేలా దోసకాయ కింద బలమైన నెట్ స్వింగ్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు వర్షం, ఎండ నుండి దోసకాయను రక్షించడానికి నిరంతరం ప్రయత్నించాడు. తాను మేలో దోసకాయ విత్తనాలు వేశానని.. ఇప్పుడు ఇంత పెద్ద దోసకాయ పెరిగిందని చెప్పాడు.
ప్రపంచంలోనే అత్యంత బరువైన సొరకాయ విన్స్ ఇంత పెద్ద కూరగాయలను పండించడం ఇదే మొదటిసారి కానప్పటికీ, వాస్తవానికి అతను ఇప్పటికే అద్భుతమైన ఫీట్ చేశాడు. సుమారు రెండు సంవత్సరాల క్రితం, అతను ప్రపంచంలోనే అత్యంత బరువైన సొరకాయను పెంచాడు , దాని బరువు 116 కిలోల కంటే ఎక్కువ. ఈ కూరగాయల కారణంగానే విన్స్ జోడిన్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..