Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

777 Movies World Record: వామ్మో.. ఏడాది పొడవునా ఏకంగా 777 సినిమాలు చూశాడు! ఆ తర్వాత ఏమైందంటే!

సాధారణంగా ఎవరైనా విరామ సమయంలో వినోదం కోసం సినిమాలు చూస్తుంటారు. వారానికి మూడో, నాలుగో సినిమాలు చూస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం సినిమాలు చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వారానికి కనీసం 16 నుంచి 17 సినిమాలైన చూడాలని గోల్‌గా పెట్టుకున్నాడు. ఇదేం దిక్కుమాలిన గోల్‌.. ఇలా చేయడం వల్ల ఇతనికేం ఒరుగుతుంది అనేగా మీరు అనుకుంటోంది. ఇతనికి కూడా ఓ లక్ష్యం ఉందండీ. అందుకోసమే ఒకే ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు..

777 Movies World Record: వామ్మో.. ఏడాది పొడవునా ఏకంగా 777 సినిమాలు చూశాడు! ఆ తర్వాత ఏమైందంటే!
777 Movies World Record
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 24, 2023 | 2:17 PM

వాషింగ్టన్, సెప్టెంబర్‌ 24: సాధారణంగా ఎవరైనా విరామ సమయంలో వినోదం కోసం సినిమాలు చూస్తుంటారు. వారానికి మూడో, నాలుగో సినిమాలు చూస్తుంటాం. కానీ అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం సినిమాలు చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. వారానికి కనీసం 16 నుంచి 17 సినిమాలైన చూడాలని గోల్‌గా పెట్టుకున్నాడు. ఇదేం దిక్కుమాలిన గోల్‌.. ఇలా చేయడం వల్ల ఇతనికేం ఒరుగుతుంది అనేగా మీరు అనుకుంటోంది. ఇతనికి కూడా ఓ లక్ష్యం ఉందండీ. అందుకోసమే ఒకే ఏడాదిలో ఏకంగా 777 సినిమాలు చూశాడు. ఇంతకీ అసలు అతనెందుకిలా చేశాడంటే..

యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన 32 ఏళ్ల జాక్ స్వోప్‌కు సినిమాలంటే మహా ఇష్టం. దీంతో ఆ సినిమాలతోనే వరల్డ్‌ గిన్సిస్‌ రికార్డు సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఓ వైపు తన ఉద్యోగం చేస్తూనే మరోవైపు థియేటర్‌లలో సినిమాలు చూడడం మొదలుపెట్టాడు. అందుకు రోజూ ఉదయం 6.45 నుంచి మధ్యాహ్నం 2.45 దాకా ఆఫీస్‌లో ఉద్యోగం చేసేవాడు. ఆ తర్వాత సమయలో రోజుకు కనీసం 3 సినిమాలకు తగ్గకుండా చూసేవాడు. సెలవు రోజుల్లో ఆ సంఖ్య రెట్టింపు చేశాడు. వారానికి 16 నుంచి 17 సినిమాలైనా చూసేవాడు. ఇలా మే 2022 నుంచి మే 2023 పూర్తయే సరికి స్వోప్‌ ఏకంగా 777 సినిమాలు చూశాడు. దీంతో ఒక సంవత్సర కాలంలో అత్యధిక సినిమాలు చూసిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో 2018లో ఫ్రాన్స్‌కు చెందిన విన్సెంట్ క్రోన్ పేరిట ఉన్న రికార్డును స్వోప్‌ బద్దలుకొట్టినట్లైంది. అప్పట్లో క్రోన్ 715 సినిమాలు చూసి రికార్డు సాధించాడు.

‘మిలియన్స్‌: రైజ్‌ ఆఫ్ గ్రూ’ అనే సినిమాతో ప్రారంభించిన స్వోప్‌ ‘ఇండియానా జోన్స్‌ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమాతో 777 సినిమాలు పూర్తి చేశాడు. అతను ఎక్కువ సార్లు వీక్షించిన సినిమా ‘పస్ ఇన్ బూట్స్: ది లాస్ట్ విష్’ . ఈ మువీని స్వోప్‌ 47 సార్లు చూశాడు. అతనికి ఇష్టమైన చిత్రం స్పైడర్ మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్, ది డెవిల్ కాన్‌స్పిరసీ.

ఇవి కూడా చదవండి

దీంతో ప్రపంచంలోనే ఏడాది కాలంలో అత్యధిక సినిమాలు చూసిన ఏకైక వ్యక్తిగా గిన్నిస్‌ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. అయితే ఈ రికార్డును కోసం స్వోప్‌ కొన్ని నియమాలు కూడా పాటించాడు. సినిమాలు చూసే సమయంలో మరొక పనిచేయకూడదు. అంటే ఫోన్‌ చూడడం, నిద్రపోవడం, సినిమా చూస్తూ తినడం లేదా తాగడం లాంటి పనులు చేయకూడదనే నియమం పెట్టుకున్నాడు. ఈ నిబంధనలన్నీ స్వోప్‌ పాటించాడని నిర్ధారణ చేసుకున్న తర్వాతే గిన్నిస్‌ వరల్‌ రికార్డ్స్‌ యాజమన్యం జాక్‌ స్వోప్‌ పేరును రికార్డుల్లో నమోదు చేసింది.

అసలు జాక్‌ స్వోప్‌ ఇదంతా ఎందుకు చేశాడంటే.. ఆటిజంపై అవగాహన పెంచడం కోసమే ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు స్వోప్‌. ‘ఆటిజం కారణంగా నేను గతంలో ఆత్మహత్యాయత్నం చేశాను. కానీ ఆత్మహత్య సరికాదని గ్రహించాడు. నాను గతంలో ఆస్పెర్గర్స్ సిండ్రోమ్‌తో బాధపడ్డాను. దాని నుంచి బయటపడడం కోసం సినిమాలు చూడడం ప్రారంభించి రికార్డు సాధించాలనుకున్నా. అందుకే ఇలా చేశాను. ఇది నా జీవితంలో అద్భుతమైన ప్రయాణం. భవిష్యత్తులో ఏడాదికి 800 సినిమాలు చూసి నా రికార్డును నేనే బద్దలు కొట్టాలని భావిస్తున్నా’ అని తెలిపాడు. ఇక ఈ రికార్డును సాధించినందుకు గాను అమెరికాలోని ఆత్మహత్య నివారణ సంస్థ జాక్‌ స్వోప్‌కు 7,777.77 డాలర్లు భారతీయ కరెన్సీలో దాదాపు రూ.6లక్షలు బహుమతిగా ఇచ్చింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.