ఇంటి నుంచి తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి.. జాగ్రత్తగా కాపాడిన శునకాలు!
అమెరికాలోని మిషిగన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి థియా చేజ్ రెండు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో కనబడకుండా పోయింది. రాత్రి సమయంలో రెండు పెంపుడు కుక్కలతోపాటు రెండేళ్ల చిన్నారి కూడా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పడిపోయారు. దీంతో పోలీసులు, స్థానికులు చిన్నారి కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలతో ఆ ప్రాంతంలో జల్లెడపట్టారు. బుధవారం (సెప్టెంబర్ 20) రాత్రి పెంపుడు కుక్కలతో ఆడుకొంటున్న చిన్నారి..
వాహింగ్టన్, సెప్టెంబర్ 24: అమెరికాలోని మిషిగన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి థియా చేజ్ రెండు రోజుల క్రితం అటవీ ప్రాంతంలో కనబడకుండా పోయింది. రాత్రి సమయంలో రెండు పెంపుడు కుక్కలతోపాటు రెండేళ్ల చిన్నారి కూడా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పడిపోయారు. దీంతో పోలీసులు, స్థానికులు చిన్నారి కోసం అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలతో ఆ ప్రాంతంలో జల్లెడపట్టారు. బుధవారం (సెప్టెంబర్ 20) రాత్రి పెంపుడు కుక్కలతో ఆడుకొంటున్న చిన్నారి థియా కుక్కలతోపాటు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. చిన్నారి జాడ కోసం స్థానికులు, పోలీసులు చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో గాలించసాగారు. డ్రోన్లు, పోలీస్ జాగిలాలతో ఎంత వెదికినా ప్రయోజనం లేకపోయింది.
చివరికి ఆల్ టెర్రయిన్ వెహికల్ (ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. ఓ చిన్నారి అర్ధరాత్రి సమయంలో ఒక కుక్కను తలదిండుగా పెట్టుకుని నిద్రిస్తోన్న దృశ్యాలు కనిపించాయి. మరో కుక్క జాగ్రత్తగా కాపలాకాస్తూ కనిపించింది. తల్లిదండ్రుల ఇంటికి దాదాపు మూడు మైళ్ల దూరంలో ఈ దృశ్యం కనిపించింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ దృశ్యం చూసి పోలీసులు, స్థానికులు ఆశ్చర్యపోయారు. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ చెప్పుకోసాగారు. అమెరికాలో మిషిగన్‌లోని ఫెయిత్ హార్న్‌కు చెందిన థియా చేజ్ (రెండేళ్లు) చిన్నారి బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోగా.. అప్పటి నుంచి చిన్నారి వెంట పెంపుడు కుక్కలు రెండు ఉన్నాయి.
వివేక్‌తో విందు.. 50 వేల డాలర్లు ఫీజు చెల్లిస్తే ఎవరైనా పాల్గొనవచ్చు
అమెరికా అధ్యక్ష రేసులో భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి ఉన్న సంగతి తెలిసిందే. అయితే వివేక్ రామస్వామికి ఎన్నకల ప్రచార నిధులు సేకరించడానికి సిలికాన్ వ్యాలీకి చెందిన పలు బడా సంస్థలు సెప్టెంబర్ 29వ తేదీన విందు ఏర్పాటు చేశాయి. ఇందులో వివేక్‌తోపాటు విందులో పాల్గొనాలనుకునే వారు 50 వేల డాలర్లు (రూ.41.47 లక్షలు) ఫీజు చెల్లించాలని ఖరారు చేశారు. ఈ విందు ద్వారా మొత్తం 10 లక్షల డాలర్లు సేకరించాలని ఆ సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని సోషల్ కేపిటల్ సంస్థ సీఈవో చమత్ నివాసంలో ఈ విందు ఏర్పాటు చేస్తున్నారు. కాగా అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు ట్రంప్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.