Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. నిక్కీహేలీ సంచలన వ్యాఖ్యలు

అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచానికే చైనా పెద్ద ముప్పుగా ఉంది. ఇప్పుడు ఆ డ్రాగన్ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం న్యూహ్యాంప్‌షైర్‌లో ఏర్పాటు చేసిన ఆర్థికవ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఆమె ఈ హెచ్చరికలు చేశారు. అమెరికాను ఓడించడం కోసం.. చైనా 50 సంవత్సరాల నుంచి పన్నాగాలు చేస్తోందని ఆరోపణలు చేస్తోంది. అయితే కొన్ని విషయాల్లో చూసుకుంటే చైనా సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలతో సమాన స్థాయిలో ఉంది.

Nikki Haley: చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది.. నిక్కీహేలీ సంచలన వ్యాఖ్యలు
Us Presidential Nikki Haley
Follow us
Aravind B

| Edited By: Ravi Kiran

Updated on: Sep 24, 2023 | 10:46 AM

అమెరికాకు మాత్రమే కాదు ప్రపంచానికే చైనా పెద్ద ముప్పుగా ఉంది. ఇప్పుడు ఆ డ్రాగన్ దేశం యుద్ధానికి సిద్ధమవుతోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం న్యూహ్యాంప్‌షైర్‌లో ఏర్పాటు చేసిన ఆర్థికవ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి ఆమె ఈ హెచ్చరికలు చేశారు. అమెరికాను ఓడించడం కోసం.. చైనా 50 సంవత్సరాల నుంచి పన్నాగాలు చేస్తోందని ఆరోపణలు చేస్తోంది. అయితే కొన్ని విషయాల్లో చూసుకుంటే చైనా సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలతో సమాన స్థాయిలో ఉంది. ఇక మన దేశ మనుగడకు, ముఖ్యంగా కమ్యూనిస్టు చైనాను ఎదుర్కోవడానికి బలం, ఆత్మాభిమానం ఎంతో అవసరం ఉంటుందని తెలిపారు. అంతేకాదు చైనా అమెరికాకు సంబంధించిన వాణిజ్య రహస్యాలను కూడా తెలుసుకుంటోందని పేర్కొన్నారు.

చైనా మనపై గెలవాలని భావిస్తోందని నిక్కీ హేలీ చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె ఆర్థిక ప్రణాళికను పంచుకుంటూ.. దేశంలో ఉన్నటువంటి మధ్య తరగతి ప్రజల కోసం నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించేందుకు బలంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. మీకు చెందినటువంటి డబ్బును మీరే మెరుగ్గా వినియోగించుకోగలరని వ్యాఖ్యానించింది. మీరందరూ కూడా మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారనే నమ్మకం నాకు ఉందని చెప్పారు. అలాగే ఫెడరల్ గ్యాస్‌‌ను, డీజిల్ పన్నును కూడా పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. అయితే ఇలాంటి వాటిని అమలు చేయడం వల్ల రికార్డు స్థాయి గ్యాస్‌ ధరలతో పోరాడుతున్నటువంటి కుటుంబాలకు ఎంతో మేలు కలుగుతుందని తెలిపారు. దేశ అధ్యక్షురాలిగా ఎన్నికైతే.. శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్నును సైతం తగ్గిస్తానంటూ హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

అలాగే ప్రస్తుతం జో బైడెన్‌ ప్రభుత్వం చేపట్టినటువంటి 500 బిలియన్‌ డాలర్ల గ్రీన్‌ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తానని పేర్కొంది. అయితే ఇలా చేయడం వల్ల శత్రు దేశానికి మన దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయంటూ పేర్కొంది. అంతేకాదు కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారులు సైతు ఐదు సంవత్సరాలకు మించి ఒకే పదవిలో ఉండకూడదని పేర్కొన్నారు. కాలపరిమితిని అమలు చేసినట్లైతే వారూ మంచి ప్రజా సేవకులుగా పనిచేస్తారని తెలిపారు. అలాగే మన ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు. ఇదిలా ఉండగా.. రాజకీయ నాయకులకే కాదు ప్రభుత్వ అధికారులకు కూడా ఐదు సంవత్సరాల పాటు కాలపరిమితి ఉండాలని.. వివేక్‌ రామస్వామి ఒహియోలో చైనాపై విదేశాంగ విధాన ప్రసంగం చేశారు. అయితే ఆయన మాట్లాడిన రెండు రోజుల అనంతరం నిక్కీ హేలి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.