AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Justin Trudeau: కెనడా ప్రధానికి తగ్గుతున్న జనాధారణ.. 50 ఏళ్లలో అత్యంత చెత్త పీఎంగా..

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య విషయంలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టీస్ ట్రూడో తీవ్ర ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిన్‌ ట్రూడోకు ఇప్పుడు ఓ గట్టి షాక్‌ తగిలింది. ప్రస్తుతం కెనడా దేశంలో ప్రధానమంత్రిగా ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతోంది. కెనడియన్ దేశస్థులు ఎక్కువమంది ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ నేత అయినటువంటి పియరీ పోయిలీవర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

Justin Trudeau: కెనడా ప్రధానికి తగ్గుతున్న జనాధారణ.. 50 ఏళ్లలో అత్యంత చెత్త పీఎంగా..
Justin Trudeau
Aravind B
| Edited By: Ravi Kiran|

Updated on: Sep 23, 2023 | 9:44 AM

Share

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య విషయంలో భారత్‌ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టీస్ ట్రూడో తీవ్ర ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో జస్టిన్‌ ట్రూడోకు ఇప్పుడు ఓ గట్టి షాక్‌ తగిలింది. ప్రస్తుతం కెనడా దేశంలో ప్రధానమంత్రిగా ఆయన పాపులారిటీ క్రమంగా తగ్గుతోంది. కెనడియన్ దేశస్థులు ఎక్కువమంది ప్రతిపక్ష కన్జర్వేటివ్‌ పార్టీ నేత అయినటువంటి పియరీ పోయిలీవర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రిగా 40 శాతం మంది కెనడా ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నట్లు సమాచారం. కెనడాకు చెందినటువంటి గ్లోబల్‌ న్యూస్‌ అనే సంస్థ ఇటీవల ఓ పోల్‌ను నిర్వహించింది. అయితే ఇందులో ఈ కీలక విషయాలను వెల్లడించింది గ్లోబల్ న్యూస్ సంస్థ. సంవత్సరం క్రితం నిర్వహించిన సర్వేతో పోల్చి చూసుకున్నట్లైతే.. ప్రధానిగా పియరీ పాపులారిటీ ఐదు శాతం పెరగడం మరో విశేషం.

ఇక ప్రస్తుతం కెనడా ప్రధానికి ఉన్న జస్టూన్ ట్రూడో పాపులారిటీ మాత్రం నిలకడగా 31 శాతం వద్దే స్థిరపడిపోయింది. మరో విషయం ఏంటంటే కెనడాలో 2025వ సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తాజాగా నిర్వహించినటువంటి పోల్స్‌ చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ నేత అయిన పియరీకి ఏకంగా 39 శాతం ఓట్లు వస్తాయని పోల్స్‌లో వెల్లడైంది. ఇక ప్రస్తుతం లిబరల్‌ పార్టీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాని జస్టీన్ ట్రూడో కేవలం 30 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని గ్లోబల్‌ న్యూస్‌ నివేదించడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఇదే సమయంలో జస్టీన్ ట్రూడోకు మద్దతు తెలుపుతున్నటువంటి న్యూ డెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్‌పై కూడా ప్రజాదరణ సైతం తగ్గిపోతున్నట్లు తెలుస్తోంది.

గత ఏడాదితో పోల్చుకున్నట్లైతే నాలుగు శాతం తగ్గిపోయింది. అయితే ఏడాది క్రితం ఆయనకు మద్దతు ఇస్తున్నవారు కూడా 26 శాతం ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 22శాతానికి పడిపోయింది. మరో విషయం ఏంటంటే అన్నింటి కంటే ముఖ్యంగా దాదాపు 60 శాతం మంది కెనడియన్స్‌ జస్టీన్ ట్రూడో పదవి నుంచి వెంటనే వైదొలగిపోవాలని కోరుకుంటున్నట్లు ఈ పోల్స్‌లో బయటపడింది. అదేవిధంగా 50 ఏళ్లలో ట్రూడో అత్యంత చెత్త ప్రధానమంత్రిగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన ఓ సర్వేలో సైతం బయటపడింది. ఇక సీటీవీ న్యూస్‌ ప్రకారం చూసుకుంటే.. ట్రూడో తండ్రి పియరీ ట్రూడో 1968- 1979, 1980- 1984 వరకు ప్రధాన మంత్రిగా ఉన్నారు. అయితే ఆ సమయంలో ఆయన కెనడాలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి