Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్

Ram Naramaneni

|

Updated on: Sep 22, 2023 | 2:10 PM

చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. ..  చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబుపై  ఫైల్ చేసిన FIR, ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది.  చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబుపై  ఫైల్ చేసిన FIR, ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు లాయర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వాదనలు విన్న న్యాయమూర్తి సీఐడీ వాదనతో ఏకీభవించి.. బాబు అప్పీల్‌ను తిరస్కరించారు. దీంతో బాబు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. ఈనెల 19న ఈ పిటిషన్‌పై బాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్లు హరీశ్‌ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఏఏజీ పొన్నవాలు వాదించారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తామని టీడీపీ చెబుతుంది.

మరోవైపు TDP అధినేత చంద్రబాబు జ్యుడిషియల్‌ రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ రెండు రోజులు పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు రిమాండ్‌ సమయం ముగియడంతో ఏసీబీ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. కస్టడీపై చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. తన 46 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు చంద్రబాబు. రాజకీయ కక్షలో భాగంగానే అరెస్ట్‌ చేశారన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Sep 22, 2023 01:22 PM