వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడుదల
చంచల్ గూడా జైలు నుండి 12 రోజుల ఎస్కార్ట్ బెయిల్ పై విడుదలయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి..నిన్న సీబీఐ కోర్టు ఆయనకు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. వైఎస్ వివేక కేసులో ఏప్రిల్ 16న భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసింది సీబీఐ..అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా 15 రోజులు బెయిల్ ఇవ్వాలని భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు 12 రోజుల పాటు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఎస్కార్ట్‌కు అయ్యే ఖర్చులు భరించాలని భాస్కర్ రెడ్డిని ఆదేశించింది..
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య.. కేసులో అరెస్ట్ అయి.. జైల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి నేడు మధ్యంతర బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి రిలీజయ్యారు. అనారోగ్య కారణాల దృష్ట్యా 12 రోజుల పాటు భాస్కర్‌రెడ్డి కి ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. భాస్కర్ రెడ్డి హెల్త్ బాలేదని కోర్టుకు చంచల్‌గూడ సూపరింటెండెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో.. న్యాయమూర్తి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 3 న చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్ ముందు సరెండర్ అవ్వాలని న్యాయమూర్తి భాస్కర్ రెడ్డిని ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి

