స్టేషన్‌ ఘన్‌పూర్‌ BRSలో ఐక్యతారాగం.. కడియం శ్రీహరికి మద్దతు ప్రకటించిన రాజయ్య

స్టేషన్‌ ఘన్‌పూర్‌ BRSలో ఐక్యతారాగం.. కడియం శ్రీహరికి మద్దతు ప్రకటించిన రాజయ్య

Rakesh Reddy Ch

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 22, 2023 | 12:17 PM

ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు తెరపడింది. కడియం శ్రీహరిని టికెట్‌ ప్రకటించడంపై ఆగ్రహంతో ఉన్న రాజయ్య ఎట్టికేలకు శాంతించారు. కొంతకాలంగా తనకే మళ్లీ టికెట్ వస్తుందని ప్రచారం చేస్తూ వచ్చారు. దీంతో అధిష్టానం జోక్యం చేసుకుని వారి మధ్య రాజీ కుదర్చింది. కేటీఆర్ సమక్షంలో ఇరువురు నేతలు ఆలింగనం చేసుకున్నారు.

కడియం శ్రీహరి అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు అందించి, పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజయ్య ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ, పార్టీ సీనియర్ లీడర్లతో జరిగిన సమావేశం అనంతరం రాజయ్య ఈ ప్రకటన చేశారు. రాజయ్యకు పార్టీ అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానం కల్పిస్తుందని సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్యకు మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. అటు తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Published on: Sep 22, 2023 12:16 PM