Telangana: ఆర్టీఏకు సిరులు కురిపిస్తోన్న ఫ్యాన్సీ నెంబర్‌ క్రేజ్‌.. ఇప్పటి వరకు..

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలో 9999 నెంబర్‌ను రూ. 21.6 లక్షలతో సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. ఇదే నెంబర్‌ను కొండాపూర్‌ ఆర్టీఓ ఆపీసులో రూ. 12.1 లక్షలకు సొంతం చేసుకున్నారు. మలక్‌పేటలో మరో వ్యక్తి 9999 నెంబర్‌ను రూ. 9.9 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఇక ఖైరతాబాద్‌ ఆర్టీఓ కార్యాలయంలో....

Telangana: ఆర్టీఏకు సిరులు కురిపిస్తోన్న ఫ్యాన్సీ నెంబర్‌ క్రేజ్‌.. ఇప్పటి వరకు..
Rta Telangana
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 22, 2023 | 12:43 PM

ఫ్యాన్సీ నెంబర్ల రిజిస్ట్రేషన్‌ ద్వారా ఆర్టీఏకు సిరులు కురుస్తోంది. పండుగ సీజన్‌కు ముందే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్స్‌ వేలం ద్వారా ఏకంగా రూ. 53.9 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది చివరి నాటికి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 72 కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఆర్టీఐ ఆర్జించిన మొత్తం రూ. 72.7 కోట్లు ఆర్జించింది. వాహన యజమానులు ఎక్కువగా ఇష్టపడే నెంబర్స్‌లో 9999, 0001, 0007, 0009 నెంబర్లు టాప్‌ స్థానాల్లో నిలిచాయి.

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలో 9999 నెంబర్‌ను రూ. 21.6 లక్షలతో సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీసులో ఈ నెంబర్‌ను సొంతం చేసుకున్నారు. ఇదే నెంబర్‌ను కొండాపూర్‌ ఆర్టీఓ ఆపీసులో రూ. 12.1 లక్షలకు సొంతం చేసుకున్నారు. మలక్‌పేటలో మరో వ్యక్తి 9999 నెంబర్‌ను రూ. 9.9 లక్షలకు సొంతం చేసుకున్నాడు. ఇక ఖైరతాబాద్‌ ఆర్టీఓ కార్యాలయంలో 0009 నెంబర్‌కు అత్యధిక బిడ్‌ రూ. 10.5 లక్షలు పలికింది. ఆర్‌టీఓ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘చాలా మంది 9ని లక్కీ నెంబర్‌గా భావిస్తారు. ఈ సంఖ్యను పారిశ్రామికవేత్తలు, నిర్మాణ సంస్థలు ఈ నెంబర్‌కు ఎక్కువ సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తారని చెప్పుకొచ్చారు.

ఆగస్టు నెలలో 9999 నెంబర్‌కు రూ. 21.6 లక్షలు పలికింది. ఇక 0009 నెంబర్ రూ. 10.5 లక్షలు, 0001 నెంబర్‌ రూ. 3.01 లక్షలకు అమ్ముడుపోయింది. నెంబర్‌లోని అన్ని సంఖ్యలను 9 కంటే తక్కువ ఉండే నెంబర్‌ కోసం యజమానులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. 029, 1223 వంటి నెంబర్లకు సైతం బిడ్డింగ్స్‌ వస్తున్నట్లు ఖైరతాబాద్‌ ఆర్టీఐ అధికారి ఒకరు చెప్పారు. దీనికి కారణం యజమానులు వారి పిల్లల పుట్టిన రోజు తేదీలను పరిగణలోకి తీసుకోవడమే అని చెబుతున్నారు. ఈ బిడ్‌లు కొన్ని సమయాల్లో రూ. 1000, లేదా రూ. 2000 కూడా ఉండొచ్చని చెప్పుకొచ్చారు. మొత్తం మీద జనాల ఫ్యాన్సీ మోజు తెలంగాణ ప్రభుత్వ ఖజానాను నింపుతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే