Viral News: ఎంతో ఇష్టంగా గ్రీన్ చట్నీ తింది.. అరుదైన వ్యాధి సోకి కుర్చీకే పరిమితం అయింది.. రీజన్ తెలిస్తే షాక్..

చదవడానికి వింతగా అనిపించే ఈ విషయం పూర్తిగా నిజం. ఈ వింత సంఘటన బ్రెజిల్‌లో కార్నీరో సోబ్రేరా అనే మహిళ గ్రీన్ చట్నీని తిని.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది. వారాల తరబడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే ఉంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, బ్రెజిల్ నివాసి అయిన కార్నీరో సోబ్రేరా గోజ్ మార్కెట్ నుండి పెస్టో సాస్‌ను కొనుగోలు చేసింది. పచ్చగా కనిపించే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అందుకే కార్నీరో సోబ్రేరా గోజ్‌కి కూడా ఈ చట్నీ  అంటే బాగా ఇష్టపడింది.

Viral News: ఎంతో ఇష్టంగా గ్రీన్ చట్నీ తింది.. అరుదైన వ్యాధి సోకి కుర్చీకే పరిమితం అయింది.. రీజన్ తెలిస్తే షాక్..
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Sep 29, 2023 | 9:36 AM

ప్రపంచ వ్యాప్తంగా భిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలున్న ప్రజలు.. భిన్నమైన రుచులు, ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఆహారంలో అన్నం, రోటీలు, కూరలు, పప్పు వంటి వాటితో పాటు చట్నీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టంగా తినే చట్నీ గ్రీన్ చట్నీ.. ఇది ఆహారపు రుచిని పెంచడమే కాదు శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఆహారం రుచిగా లేకపోయినా సరే అందులో గ్రీన్ చట్నీని కలిపి తింటే రుచి పెరుగుతుంది. గ్రీన్ చట్నీకి మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా క్రేజ్ ఉంది. అయితే ఒక మహిళ ఎంతో ఇష్టంగా గ్రీన్ చట్నీ ఆమె శరీరానికి ప్రమాదకరంగా మారింది. వ్యాధుల బారిన పడింది. వివరాల్లోకి వెళ్తే..

చదవడానికి వింతగా అనిపించే ఈ విషయం పూర్తిగా నిజం. ఈ వింత సంఘటన బ్రెజిల్‌లో కార్నీరో సోబ్రేరా అనే మహిళ గ్రీన్ చట్నీని తిని.. ప్రాణాల మీదకు తెచ్చుకుంది. వారాల తరబడి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూనే ఉంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, బ్రెజిల్ నివాసి అయిన కార్నీరో సోబ్రేరా గోజ్ మార్కెట్ నుండి పెస్టో సాస్‌ను కొనుగోలు చేసింది. పచ్చగా కనిపించే ఈ చట్నీ చాలా రుచిగా ఉంటుంది. అందుకే కార్నీరో సోబ్రేరా గోజ్‌కి కూడా ఈ చట్నీ  అంటే బాగా ఇష్టపడింది. చట్నీ బాగానే ఉందని తిన్న ఆ మహిళ పరిస్థితి విషమించింది.

 ఒక్క తప్పు వల్లే

నివేదిక ప్రకారం, కార్నీరో సోబ్రేరా గ్రీన్ చట్నీ తిన్న వెంటనే..ఆమె ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపడం ప్రారంభించింది. క్రమంగా ఆరోగ్యం క్షీణించింది. పదే పదే వాంతులు చేసుకుంది. క్రమంగా క్రమంగా ఆమె  పరిస్థితి మరీ దారుణంగా మారింది. చివరకి ఆమె తన చేతులు, కాళ్లు కూడా కదపలేని స్టేజ్ కు చేరుకుంది. అంతేకాదు నాలుక కూడా మొద్దుబారిపోయింది. జలదరింపు అనుభూతి మొదలైంది. తనకు ఆరోగ్యం క్రమంగా క్షీణించడం గుర్తించిన ఆమె ఎలాగోలా కష్టపడి ఆసుపత్రికి చేరుకుంది. ఆమె పరిస్థితిని చూసిన వైద్యులు వెంటనే సీటీ స్కాన్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఆమె శరీరంలోని చాలా భాగాలు పనిచేయడం మానేశాయని వైద్యులు గుర్తించారు. డాక్టర్ల ప్రకారం కార్నీరో బోటులిజం అనే అరుదైన వ్యాధితో బాధపడుతుంది. ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత ఆమె చేసిన తప్పు తెలుసుకుని షాక్ తింది.  చేసిన తప్పు ఏమిటంటే చట్నీ గడువు తీరిందో లేదో తనిఖీ చేయలేదు. గ్రీన్ చట్నీని షాప్ నుంచి తీసుకుని వచ్చి.. అలాగే ఉపయగించడం ప్రమాదానికి కారణం అయింది. ఈ తప్పు వల్ల ఆమె ప్రస్తుతం వికలాంగురాలిగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,,

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..