Viral Video: ఎండిన బావిలో వేడినీటి కుతకుతలు..? క్యూ కడుతున్న జనం.!
బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ఒక బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. అయితే ఉన్నట్టుండి ఈ బావిలో నుంచి నీరు ఉబికివస్తోంది. అంతేకాదు, ఈ బావిలోని నీరు కుతకుతా ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ బావి గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని ఒక బావి చర్చనీయాంశంగా మారింది. ఈ బావిని చూసేందుకు దూర ప్రాంతాల నుంచి సైతం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ బావి గత 20 ఏళ్లుగా పూర్తిగా ఎండిపోయివుంది. అయితే ఉన్నట్టుండి ఈ బావిలో నుంచి నీరు ఉబికివస్తోంది. అంతేకాదు, ఈ బావిలోని నీరు కుతకుతా ఉడుకుతున్నట్లు కనిపిస్తోంది. దీనిని చూసిన జనం హడలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో ఈ బావి గురించి రకరకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. భాగల్‌పూర్ జిల్లాలోని గోరాడీప్ పరిధిలోని హర్చండీ గ్రామంలోని బదరీ బహరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడున్న ఒక ఎండిన బావిలో ఉన్నట్టుండి నీరు ప్రత్యక్షమై, అది వేడికి ఉడుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ నీటిని పరిశీలించి చూస్తే చల్లగానే ఉండటం విశేషం. గ్రామానికి చెందిన ఓ యువకుడు మెట్ల ద్వారా బావిలోనికి వెళ్లి చూడగా, నీరు ఒక మట్టం వరకేవచ్చి ఆగిపోయివుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ బావి 70 ఏళ్ల క్రితం నిర్మితమయ్యింది. గత కొన్నేళ్లుగా ఈ బావి పూర్తిగా ఎండిపోయింది. గ్రామానికి చెందిన ప్రొఫెసర్ ఈ నీటిని డీటీఎస్ పరీక్షలకు పంపారు. ఈ నీరు తాగేందుకు ఏమాత్రం యోగ్యం కాదని తెలిపారు. అయితే ఈ బావి వద్దకు చేరుకుంటున్న గ్రామస్తులు దానిలోని నీటితో స్నానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే.. ఈ నీటితో స్నానం చేసిన గ్రామానికి చెందిన సునైనాదేవి అనే మహిళ తనకున్న చర్మ సంబంధిత రోగాలు మాయమయ్యాయని తెలిపిందట. అది ఎంతవరకూ నిజమో తెలియదు కానీ.. గ్రామస్తులంతరూ పోటీపడి మరీ ఈ బావిలోని నీటితో స్నానం చేస్తున్నారు. ఈ నీటి గురించి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

