జాతీయ రహదారిపై కోతిపిల్లను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం !! ముగ్గురు వ్యక్తులు సపర్యలు

జాతీయ రహదారిపై కోతిపిల్లను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం !! ముగ్గురు వ్యక్తులు సపర్యలు

Phani CH

|

Updated on: Sep 28, 2023 | 10:33 PM

నేషనల్‌ హైవేస్‌ పక్కన జంతువులు సంచరిస్తూ ఉండటం మనం చూస్తుంటాం. రోడ్డు పై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. అలాంటి సమయంలో జంతువులు రోడ్డు దాటుతూ ప్రమాదాలబారిన పడుతుంటాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతాయి. ఎక్కువగా రహదారి పక్కన చెట్లపై కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఆహారం కోసం అటు ఇటూ తిరుగుతూ కోతులు ఎక్కువగా ప్రమాదాల్లో పడతాయి. తాజాగా ఓ కోతి పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఆ కోతిపిల్ల అచేతనంగా రోడ్డుపై పడిఉంది.

నేషనల్‌ హైవేస్‌ పక్కన జంతువులు సంచరిస్తూ ఉండటం మనం చూస్తుంటాం. రోడ్డు పై వాహనాలు వేగంగా దూసుకెళ్తుంటాయి. అలాంటి సమయంలో జంతువులు రోడ్డు దాటుతూ ప్రమాదాలబారిన పడుతుంటాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోతాయి. ఎక్కువగా రహదారి పక్కన చెట్లపై కోతులు కనిపిస్తూ ఉంటాయి. ఆహారం కోసం అటు ఇటూ తిరుగుతూ కోతులు ఎక్కువగా ప్రమాదాల్లో పడతాయి. తాజాగా ఓ కోతి పిల్లను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో ఆ కోతిపిల్ల అచేతనంగా రోడ్డుపై పడిఉంది. తోటి కోతులు దానిని చూస్తూ ఏం జరిగిందో తెలియక అయోమయంగా అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఇంతలో ఓ వ్యక్తి మానవత్వంతో స్పందించిన ఇద్దరు వ్యక్తులు కొన ఊపిరితో ఉన్న ఆ కోతిని రక్షించే ప్రయత్నం చేశారు. ఇంతలో అటుగా వెళ్తున్న అంబులెన్స్‌ డ్రైవర్ విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లి కోతికి సీపీఆర్‌ చేసి బ్రతికించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ చిట్టి గుండెకు బలంగా దెబ్బ తగలడంతో అతని ప్రయత్నం ఫలించలేదు. కాసేపు ఊపిరి తీసుకున్న ఆ చిన్ని ప్రాణి చివరికి ప్రాణాలు విడిచింది. కోతిని కాపాడాలనుకున్న ఆ ముగ్గు వ్యక్తులు నిస్సహాయంగా ఆ కోతిపిల్ల మృత కళేబరాన్ని అక్కడే వదిలి వెను తిరిగారు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. మూగజీవిపట్ల ఆ ముగ్గురు స్పందించిన తీరుకు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వీడు దొంగే…. కానీ నిజాయితీ ఉన్నోడు.. తనిఖీలో పట్టుబడ్డ వాహనాలు

అరగంటపాటు గాల్లో తలక్రిందులుగా వేలాడిన జనం !! అసలు ఏం జరిగిందంటే ??

రంగులు మార్చే ఊసరవెల్లి చీర !! తయారీకి రూ. 2.8 లక్షలు ఖర్చు

ఏసీ వేసుకొని నిద్రపోయిన డాక్టర్.. అప్పుడే పుట్టిన ఇద్దరు బిడ్డలు మృతి

అయ్యబాబోయ్‌ కొండచిలువ.. అర్ధరాత్రి రోడ్డు దాటుతూ