రంగులు మార్చే ఊసరవెల్లి చీర !! తయారీకి రూ. 2.8 లక్షలు ఖర్చు
గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను సృష్టించి చేనేత రంగంలో తన ప్రతిభను చాటారు సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల పరంధాములు. ఆయన వారసత్వాన్నే ఆయన కుమారుడు నల్ల విజయ్ కొనసాగిస్తున్నారు. చేనేత రంగంలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ అబ్బురపరుస్తున్నారు. తన తండ్రిదారిలోనే నడుస్తున్న విజయ్ తాజాగా అద్భుతమైన చీరను ఆవిష్కరించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే చీరను రూపొందించారు. ఈయన ప్రతిభను చూసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పొగడ్తలతో ముంచేశారు.
గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను సృష్టించి చేనేత రంగంలో తన ప్రతిభను చాటారు సిరిసిల్ల నేత కళాకారుడు నల్ల పరంధాములు. ఆయన వారసత్వాన్నే ఆయన కుమారుడు నల్ల విజయ్ కొనసాగిస్తున్నారు. చేనేత రంగంలో ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ అబ్బురపరుస్తున్నారు. తన తండ్రిదారిలోనే నడుస్తున్న విజయ్ తాజాగా అద్భుతమైన చీరను ఆవిష్కరించారు. ఊసరవెల్లిలా రంగులు మార్చే చీరను రూపొందించారు. ఈయన ప్రతిభను చూసి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పొగడ్తలతో ముంచేశారు. ఇలాంటి అద్భుతాలు మరిన్ని సృష్టించాలంటూ అభినందించారు. తెలంగాణ సెక్రటేరియట్లో తాజాగా కేటీఆర్ నేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించిన ఊసరవెల్లి చీరను ఆవిష్కరించారు. ఈ ఊసరవెల్లి చీరను తయారు చేసేందుకు 30 గ్రాముల బంగారాన్ని, 500 గ్రాముల వెండిని వాడారు. వీటితో పాటే విభిన్న రంగులు మారే పట్టు పోగులను సుమారు 30 రోజుల పాటు శ్రమించి తయారు చేశారు. ఈ చీర తయారు కావడానికి రూ.2.80లక్షలు ఖర్చు అయ్యిందని విజయ్ తెలిపారు. రంగులు మారే ఈ చీర పొడవు 6.30 మీటర్లు, వెడల్పు 48 ఇంచులు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏసీ వేసుకొని నిద్రపోయిన డాక్టర్.. అప్పుడే పుట్టిన ఇద్దరు బిడ్డలు మృతి
అయ్యబాబోయ్ కొండచిలువ.. అర్ధరాత్రి రోడ్డు దాటుతూ
రోడ్డు మీద దొరికితే పిల్లి అనుకొని తెచ్చి పెంచింది.. పెద్దయ్యాక చూస్తే షాక్
భూమికి చేరిన ఆస్టరాయిడ్ బెన్నూ శాంపిల్స్
114 కేజీల బుద్ధ విగ్రహం చోరీ.. ఒక్కడే ఎత్తుకుపోవడం పై షాకైన పోలీసులు
కోట్లు ఇచ్చినా రాని ఆనందం.. రైతన్నను మురిపించిన నేల తల్లి
ఆ ఒక్క మాటతో.. ఆ మేనేజర్ లేచి వెళ్లిపోయాడు !
కొమ్ముతో జీపును ఎత్తిపడేసింది! భయంతో కేకలు వేసిన టూరిస్ట్‌లు..
10 నిమిషాల డెలివరీ కంటే ప్రశాంతతే ముఖ్యం!
కరెంట్ లేకుండానే కూలింగ్! ఇక ఏసీతో పనిలేదు
వామ్మో... ఆ ఊరి నిండా పాములే!
భీమేశ్వరాలయ సమీపంలో అరుదైన శ్వేతనాగు.. ప్రత్యక్షం

