114 కేజీల బుద్ధ విగ్రహం చోరీ.. ఒక్కడే ఎత్తుకుపోవడం పై షాకైన పోలీసులు

114 కేజీల బుద్ధ విగ్రహం చోరీ.. ఒక్కడే ఎత్తుకుపోవడం పై షాకైన పోలీసులు

Phani CH

|

Updated on: Sep 28, 2023 | 9:59 PM

అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ ఆర్ట్‌ గ్యాలరీ నుంచి రూ.12.5 కోట్ల విలువైన పురాతన బుద్ధ విగ్రహాన్ని చోరీ చేశాడో దుండగుడు. అయితే 4 అడుగుల పొడవు, 114 కేజీల బరువైన ఈ విగ్రహాన్ని ఒక్కడే ఎత్తుకుపోవడంపై పోలీసులు ఆశ్చర్యపోయారు. బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్ ఆర్ట్‌ గ్యాలరీలో సెప్టెంబర్‌ 18న చోరీ జరిగింది. తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఒక వ్యక్తి ప్రవేశ ద్వారం నుంచి లోపలకు చొరబడ్డాడు. వందల ఏళ్ళ నాటి కాంస్య బుద్ధ విగ్రహాన్ని ట్రాలీ ద్వారా బయటకు తీసుకెళ్లాడు.

అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ ఆర్ట్‌ గ్యాలరీ నుంచి రూ.12.5 కోట్ల విలువైన పురాతన బుద్ధ విగ్రహాన్ని చోరీ చేశాడో దుండగుడు. అయితే 4 అడుగుల పొడవు, 114 కేజీల బరువైన ఈ విగ్రహాన్ని ఒక్కడే ఎత్తుకుపోవడంపై పోలీసులు ఆశ్చర్యపోయారు. బెవర్లీ గ్రోవ్‌లోని బరాకత్ ఆర్ట్‌ గ్యాలరీలో సెప్టెంబర్‌ 18న చోరీ జరిగింది. తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో ఒక వ్యక్తి ప్రవేశ ద్వారం నుంచి లోపలకు చొరబడ్డాడు. వందల ఏళ్ళ నాటి కాంస్య బుద్ధ విగ్రహాన్ని ట్రాలీ ద్వారా బయటకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఒక లారీలో దానిని ఎత్తుకుపోయాడు. సుమారు 25 నిమిషాల్లో ఈ దొంగతనం పూర్తి చేశాడు. పురాతన బుద్ధ విగ్రహం చోరీ సంఘటన అక్కడి సీసీటీవీలో రికార్డైంది. అయితే సుమారు 114 కేజీల బరువున్న భారీ బుద్ధ విగ్రహాన్ని ఒక్కడే ఒంటరిగా చాలా సునాయసంగా ఎత్తుకెళ్లిన తీరు చూసి లాస్ ఏంజెల్స్‌ పోలీసులు నోరెళ్లబెట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క పోస్టర్ జోలికెళ్తే.. చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది

ఆఖరి మజిలీ కోసం.. ఊరు ఊరంతా ఒక్కటైంది

రూ. 830 కోట్ల ఖరీదైన కారులో తిరిగిన యూట్యూబర్