కుక్క పోస్టర్ జోలికెళ్తే.. చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది
కుక్క పోస్టర్ తొలగించినందుకు ఓ మహిళ రెచ్చిపోయింది. హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పై దాడి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోయిడా సెక్టార్ 75లోని ఎయిమ్స్ గోల్ఫ్ అవెన్యూ సొసైటీలో ఆషి సింగ్ నివసిస్తోంది. ఆమె పెంపుడు కుక్క ఒకటి ఇటీవలే తప్పిపోయింది. దీంతో కుక్క మిస్సింగ్ పోస్టర్‌ను సొసైటీ ఆవరణలో అంటించారు. అయితే సొసైటీ ప్రెసిడెంట్ నవీన్ మిశ్రా ఆ పోస్టర్ తొలగించాడు.
కుక్క పోస్టర్ తొలగించినందుకు ఓ మహిళ రెచ్చిపోయింది. హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ పై దాడి చేసింది. ఉత్తర్ ప్రదేశ్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నోయిడా సెక్టార్ 75లోని ఎయిమ్స్ గోల్ఫ్ అవెన్యూ సొసైటీలో ఆషి సింగ్ నివసిస్తోంది. ఆమె పెంపుడు కుక్క ఒకటి ఇటీవలే తప్పిపోయింది. దీంతో కుక్క మిస్సింగ్ పోస్టర్‌ను సొసైటీ ఆవరణలో అంటించారు. అయితే సొసైటీ ప్రెసిడెంట్ నవీన్ మిశ్రా ఆ పోస్టర్ తొలగించాడు. ఆ విషయం తెలుసుకున్న ఆషి సింగ్ కోపంతో ఊగిపోయింది. నవీన్ కాలర్ పట్టుకుని పోస్టర్ ఎందుకు తొలగించావని నిలదీసింది. నవీన్ విడిపించుకునే ప్రయత్నం చేసినా ఆషి సింగ్ మాత్రం వెనక్కి తగ్గలేదు. కాలర్ వదిలి మర్యాదగా మాట్లాడమని అతను చెప్పడంతో ఆమె మరింత రెచ్చిపోయింది. నవీన్ జుట్టుపట్టుకుని అతని చెంపలు వాయించింది. నవీన్ విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నా ఆషి సింగ్ వెంట ఉన్న మరో వ్యక్తి … నవీన్ చేయి పట్టుకుని ఆమెకు సహకరించాడు. గొడవ విషయం తెలిసి అక్కడకు చేరుకున్న కొందరు జోక్యం చేసుకుని విడిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

