ఆఖరి మజిలీ కోసం.. ఊరు ఊరంతా ఒక్కటైంది
మనిషి ఆఖరి మజిలీ అది.. శాశ్వతంగా ప్రశాంతంగా నిదురోయే స్థలమది.. కానీ ఆ చివరి ప్రయాణంలో చేరే గమ్యస్థలం అక్కడ వివాదాలకు కారణమైంది. ఈ స్థలం నాదంటూ ఓ వ్యక్తి హద్దులు పాతడంతో రెండుగా చీలింది ఊరు. చివరికి ఆ స్థలం శ్మశానాకి దక్కాల్సిందేనంటూ ఊరు ఊరంతా ఒక్కటైంది. శ్మశాన స్థలాన్ని కబ్జా చేశాడంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. శ్మశానం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం అంటూ ప్రకటించిందా గ్రామం.
మనిషి ఆఖరి మజిలీ అది.. శాశ్వతంగా ప్రశాంతంగా నిదురోయే స్థలమది.. కానీ ఆ చివరి ప్రయాణంలో చేరే గమ్యస్థలం అక్కడ వివాదాలకు కారణమైంది. ఈ స్థలం నాదంటూ ఓ వ్యక్తి హద్దులు పాతడంతో రెండుగా చీలింది ఊరు. చివరికి ఆ స్థలం శ్మశానాకి దక్కాల్సిందేనంటూ ఊరు ఊరంతా ఒక్కటైంది. శ్మశాన స్థలాన్ని కబ్జా చేశాడంటూ ఆరోపిస్తూ ఆందోళనకు దిగింది. శ్మశానం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దం అంటూ ప్రకటించిందా గ్రామం. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో శ్మశాన వాటిక స్థలం వివాదస్పదంగా మారింది. శతాబ్ద కాలంగా ఊరివారందరి అంతిమక్రియలు సాగుతున్న స్థలాన్ని ఓ వ్యక్తి గత ఆరేళ్ళ క్రితం కబ్జా చేశాడు. రెవెన్యూ రికార్డ్ ల ప్రకారం పంట పొలం పక్కనే ఉన్న 79 సెంట్ల భూమిని తనదేనంటూ గ్రామస్తుల అంత్యక్రియలకు అడ్డుపడుతున్నాడు. శ్మశానికి స్థలం కరువవడంతో చనిపోయినా వారికి అంతిమ సంస్కరాలకు స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడక తప్పడం లేదు. దీంతో విసిగి వేశారిన గ్రామస్తులంతా ఒక్కటై శ్మశాన స్థలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పోరాటానికి దిగారు. కబ్జాకు గురైన భూమిలో గ్రామస్తులంతా కట్టెలు పాతి శ్మశాన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ. 830 కోట్ల ఖరీదైన కారులో తిరిగిన యూట్యూబర్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

