రూ. 830 కోట్ల ఖరీదైన కారులో తిరిగిన యూట్యూబర్
అతడు రూ. 830 కోట్ల ఖరీదైన కారులో తిరిగాడు!! మీరు విన్నది నిజమే! అత్యధికమంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లలో ఒకడైన అమెరికన్ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్ నాలుగు రోజుల కిందట 10 కోట్ల డాలర్ల విలువైన కారులో చక్కర్లు కొట్టాడు. ఫెరారీ 125 ఎస్ మోడల్‌లో తయారైన తొలి కారు ఇది. అంత విలువైన కారు కాబట్టే మ్యూజియంలో ఉంచారు. ఒక డాలర్ కారు నుంచి వందల కోట్ల విలువైన కారును నడుపుతూ జిమ్మీ రోడ్డుమీదికొచ్చాడు.
అతడు రూ. 830 కోట్ల ఖరీదైన కారులో తిరిగాడు!! మీరు విన్నది నిజమే! అత్యధికమంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లలో ఒకడైన అమెరికన్ యూట్యూబర్ జిమ్మీ డోనాల్డ్సన్ అలియాస్ మిస్టర్ బీస్ట్ నాలుగు రోజుల కిందట 10 కోట్ల డాలర్ల విలువైన కారులో చక్కర్లు కొట్టాడు. ఫెరారీ 125 ఎస్ మోడల్‌లో తయారైన తొలి కారు ఇది. అంత విలువైన కారు కాబట్టే మ్యూజియంలో ఉంచారు. ఒక డాలర్ కారు నుంచి వందల కోట్ల విలువైన కారును నడుపుతూ జిమ్మీ రోడ్డుమీదికొచ్చాడు. మ్యూజియం ఉద్యోగి డ్రైవింగ్ చేస్తుండగా పక్కనే కూర్చుని తీసుకున్న వీడియోను ట్విటర్లో పోస్టవడంతో వైరల్ అయ్యింది. 830 కోట్ల డాలర్ల కారేమిటని జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే కొన్ని పాతమోడల్ కార్ల విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందట. ఫెరారీ 125 ఎస్ ఖరీదు అంతే అని ఆ కారులో ప్రయాణంపై జిమ్మీ స్పందిస్తూ, తను అలాంటి కారులో వెళ్తున్నానంటే నమ్మలేకపోతున్నానని అన్నాడు. మ్యూజియంలోని ఒక ఉద్యోగికి మాత్రమే దీన్ని నడిపే హక్కు ఉంది అని చెప్పుకొచ్చాడు. కారును బయటికి తీసుకొచ్చినప్పుడు చుట్టుపక్కల పోలీసులను మోహరించారని కారు దెబ్బతినకుండా గుంతలు పూడ్చారని జిమ్మి చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రూ.2వేల నోటు మార్పిడికి మరో 5 రోజులే గడువు..
బాహుబలి విమానం వచ్చేసింది.. ఇక శత్రువులకు గుండెదడే !!
రోగులకు చేతబడి చేశారంటూ క్షుద్రపూజలు చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు !! చివరికి ??
Navdeep: నవదీప్ గుట్టంతా ఆ మొబైల్ ఫోన్‌లోనే !! ఫోన్ తెరిస్తే హీరో పని ఔట్.