ఏసీ వేసుకొని నిద్రపోయిన డాక్టర్.. అప్పుడే పుట్టిన ఇద్దరు బిడ్డలు మృతి
ఓ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యానికి ఇద్దరు నవ జాతశిశువుల ప్రాణాలు బలయ్యాయి. ఆసుపత్రిలో ఏసీ వేసుకుని డాక్టర్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రంతా ఏసీ చలికి తాళలేక ఇద్దరు నవజాత శిశువులు చనిపోవడంతో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డలు మరణించారని ఆరోపించారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని శమ్లీలో సెప్టెంబర్ 25న చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని శమ్లీ జిల్లాలోని కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు […]
ఓ నకిలీ వైద్యుడి నిర్లక్ష్యానికి ఇద్దరు నవ జాతశిశువుల ప్రాణాలు బలయ్యాయి. ఆసుపత్రిలో ఏసీ వేసుకుని డాక్టర్ గాఢ నిద్రలోకి జారుకున్నాడు. రాత్రంతా ఏసీ చలికి తాళలేక ఇద్దరు నవజాత శిశువులు చనిపోవడంతో ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు బైఠాయించి ఆందోళనకు దిగారు. డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే తమ బిడ్డలు మరణించారని ఆరోపించారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని శమ్లీలో సెప్టెంబర్ 25న చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని శమ్లీ జిల్లాలోని కైరాణా ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు వేరు వేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు చిన్నారులు సెప్టెంబర్ 23వ తేదీన జన్మించారు. అనంతరం వైద్యుల సలహా మేరకు అదే రోజు శిశువులకు మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేట్ క్లినిక్‌కు తరలించారు. సదరు ఆసుపత్రిలోని ఫొటో థెరపీ వార్డులో శిశువులను ఉంచి చికిత్స అందిస్తున్నారు. అదే వార్డులో విధులు నిర్వహిస్తోన్న డాక్టర్ నీతు కుమార్ పిల్లలను పట్టించుకోపోగా.. ఏసీ వేసుకుని రాత్రంతా నిద్రపోయాడు. డాక్టర్‌తోపాటు ఇతర సిబ్బంది కూడా గుర్రు పెట్టినిద్రపోయారు. మర్నాడు ఉదయం శిశువులను చూసేందుకు వార్డులోకి వెళ్లిన తల్లిదండ్రులకు శిశువులు విగతజీవులుగా కనిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయ్యబాబోయ్ కొండచిలువ.. అర్ధరాత్రి రోడ్డు దాటుతూ
రోడ్డు మీద దొరికితే పిల్లి అనుకొని తెచ్చి పెంచింది.. పెద్దయ్యాక చూస్తే షాక్
భూమికి చేరిన ఆస్టరాయిడ్ బెన్నూ శాంపిల్స్
114 కేజీల బుద్ధ విగ్రహం చోరీ.. ఒక్కడే ఎత్తుకుపోవడం పై షాకైన పోలీసులు
కుక్క పోస్టర్ జోలికెళ్తే.. చెంప దెబ్బలు తినాల్సి వచ్చింది