Andhra Pradesh: బీచ్ లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను పరుగులు పెట్టించిన మిస్టరీ పెట్టె.. చివరకు తేలింది ఏంటంటే..?

ఈ ఉదయాన్నే ఆ బాక్స్ దగ్గరకు జనం పెద్ద ఎత్తున వస్తుండడం తో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. విశాఖ లో తూర్పు తీర నౌకా దళ హెడ్ క్వార్టర్ కూడా ఉండడం తో సెక్యూరిటీ కోణం లో కూడా అప్రమత్తం కావాల్సి వచ్చింది. వెంటనే డాగ్ స్క్వాడ్ ను తెచ్చారు. బాక్స్ చుట్టూ పది రౌండ్లను వేయించారు. ఎలాంటి అనుమానాన్ని వ్యక్తం చేయలేదు స్నిఫర్ డాగ్. అనంతరం 5 మంది సభ్యులతో కూడిన బాంబ్ డిస్పోజల్ స్కాడ్ వచ్చింది.

Andhra Pradesh: బీచ్ లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను పరుగులు పెట్టించిన మిస్టరీ పెట్టె.. చివరకు తేలింది ఏంటంటే..?
Vizag Bizaare Box
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 30, 2023 | 3:39 PM

విశాఖపట్నం, సెప్టెంబర్30:  అలలతో అలరారించే సాగర తీరం ఒక బాక్స్ లాంటి చెక్క దిమ్మె తో ఒక్కసారిగా అంతే ఆందోళనకు గురి చేసింది. దాదాపు 14 గంటల పాటు సస్పెన్స్ కు, ఆశ్చర్యానికి గురి చేసిన ఆ వ్యవహారం లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్వాడ్ ల హడావుడి, భారీ ఎత్తున జన సమూహం లో రెండు జేసీబీలు ఆ బాక్స్ ను పగల గొట్టడం లాంటి యాక్షన్ సీన్స్ తో ఈ ఉదయం విశాఖ గంభీరంగా తయారైంది. ఆ యాక్షన్ సన్నివేశాలను చూసి ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందేమో అని చూడడానికి వచ్చిన వాళ్ళు బాక్స్ వ్యవహారం విని ఔరా అనుకుని వెనుతిరగడం విశేషం..ఇంతకీ ఆ వింత బాక్స్ మిస్టరీ ఏంటంటే..

నిన్న రాత్రి 10. 30 గంటల సమయం. అప్పుడప్పుడే బీచ్ నుంచి అందరూ నిష్క్రమిస్తూ ఉన్నారు. ఆ మసక మసక చీకటిలో దూరం గా ఒక పెద్ద బాక్స్ లాంటి ఆకారం అలలతో కలిసి ఒడ్డుకు రావడం కనిపించింది. అప్పుడప్పుడే అక్కడ నుంచి వెళ్తున్న బీచ్ సందర్శకుల దృష్టి అంతా దానిపైనే పడింది. సాధారణంగా మత్స్యకారుల బోట్ లో, లేదంటే దూరంగా కంటైనర్ వెజల్స్ లాంటివి ఉంటాయ్ కానీ తీరం వైపు వస్తున్న ఆ బాక్స్ దీనికి చెందిందో అర్దం కాలేదు. ఆ బాక్స్ ఏదైనా షిప్ నుంచి పడిపోయిందో, లేదంటే జరుగుతున్న ఘోరాల నేపథ్యం లో ఎవరినైనా హత్య చేసి అలా బాక్స్ లో పెట్టారో లేదంటే శత్రు దేశాలు ఏమైనా అలాంటి బాక్స్ ల తో ఏదైనా విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారెమో .. అలా రకరకాల అనుమానాల తో అందరూ ఆ బాక్స్ చుట్టూ గుమి కుడారు. అక్కడ జన సమూహాన్ని చూసి బీచ్ బీట్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు వచ్చి అక్కడే జీ వి ఎం సీ చేస్తున్న ఎర్త్ వర్క్ ల దగ్గర ఉన్న జే సీబీ సహాయం తో ఆ బాక్స్ ను ఒడ్డుకు తీసుకొచ్చారు కానీ చీకట్లో అందెంటో అర్దం కాలేదు. దాంతో ఉదయాన్నే పరిక్షిద్దామని అక్కడ ఒక బీట్ కానిస్టేబుల్ ను ఉంచి అందరినీ పంపించేశారు.

బాంబ్, డాగ్ స్క్వాడ్ లతో బాక్స్ తనిఖీ..

ఇవి కూడా చదవండి

ఈ ఉదయాన్నే ఆ బాక్స్ దగ్గరకు జనం పెద్ద ఎత్తున వస్తుండడం తో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. విశాఖ లో తూర్పు తీర నౌకా దళ హెడ్ క్వార్టర్ కూడా ఉండడం తో సెక్యూరిటీ కోణం లో కూడా అప్రమత్తం కావాల్సి వచ్చింది. వెంటనే డాగ్ స్క్వాడ్ ను తెచ్చారు. బాక్స్ చుట్టూ పది రౌండ్లను వేయించారు. ఎలాంటి అనుమానాన్ని వ్యక్తం చేయలేదు స్నిఫర్ డాగ్. అనంతరం 5 మంది సభ్యులతో కూడిన బాంబ్ డిస్పోజల్ స్కాడ్ వచ్చింది. బాక్స్ లాంటి ఆకారం లో ఉన్న ఆ చెక్క దిమ్మె లోపలకు అంతా తోసి వెరిఫై చేశారు. ఎలాంటి ప్రమాద కర, పేలుడు పదార్థాల జాడ కనిపించలేదు. వెంటనే రెండు బుల్డోజర్ ల సహాయంతో ఆ పది అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు కలిగిన ఆ బాక్స్ ను విడదీసే ప్రయత్నం చేశారు. అరగంట సేపు యాక్షన్ సీన్ ను తలపించిన ఆ ఆపరేశన్ తర్వాత అది కేవలం చెక్క దిమ్మె గా నిర్దారించారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

లంగర్ బదులు వాడే వ్యవస్థ..

తీరా అంత పెద్ద బాక్స్ లాంటి చెక్క దిమ్మె సముద్రం లో ఎందుకు ఉందన్న అనుమానంతో ఆరా తీశారు అధికారులు. అలాంటి వాటిలో రెండు సందర్భాలలో వినియోగిస్తారని, గతంలో చిన్న చిన్న షిప్ ల కు లంగర్ వేయడం బదులు వీటిని ఆ షిప్ లకు జాయింట్ చేస్తారని దీంతో ఆ చిన్న షిప్ లు అలానే ఉండి పోతాయన్నది ఒక కారణం అయితే రెండో కారణం కంటైనర్ లతో వచ్చే వెజల్స్ లో కంటైనర్ లను దించే సమయం లో ఇలాంటి వుడెన్ బెడ్స్ ను వినియోగిస్తారని వాటిలో ఒకటి షిప్ నుంచి పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!