పితృ దోషాన్ని ఎలా గుర్తించాలి..? దోష నివారణకు సింపుల్ రెమెడీస్ పాటించండి..

పండితుల సలహా మేరకు దోష నివారణ పాటించాలి. పితృదోషం ఉంటే చిన్న వారు అకాలమరణం పొందుతారు. శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ కావటం, వారు ఆస్పత్రి పాలుకావడం వంటివి ఎదుర్కొవాల్సి వస్తుంది. అప్పులపాలు కావడం, అపనిందలు మోయడం కూడా కుటుంబంపై పితృదోశం ఉన్నవారు ఎదుర్కొవాల్సి ఉంటుందని జ్యోతిశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురికావటం కూడా పితృదోశంగా గుర్తించాలంటున్నారు.

పితృ దోషాన్ని ఎలా గుర్తించాలి..? దోష నివారణకు సింపుల్ రెమెడీస్ పాటించండి..
Pitra Dosh
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 29, 2023 | 10:21 PM

మీరు మీ జాతకంలో పితృదోషంతో ఇబ్బంది పడుతుంటే, వెంటనే కొన్ని నివారణలు చేయడం అవసరం. పూర్వీకుల శాపాలు కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని ఆధ్యాత్మిక విశ్లేషకులు, గ్రంధాలు చెబుతున్నాయి. కాబట్టి పితృ దోషం తొలగిపోతే, కుటుంబంలో సంతోషం పెరుగుతుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరణానంతరం పూర్వీకుల ఆత్మ శాంతించేందుకు తర్పణం చేస్తారు. తదనుగుణంగా పరిహారాలు చేయడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారు. వారసులపై వరాలు కురిపిస్తారు. పూర్వీకుల అసంతృప్తి కారణంగా జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.

పూర్వీకుల ఫోటోలను నైరుతి గోడ మూలలో ఉంచాలని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారి ఫోటో నవ్వుతున్నట్లుగా ఉండేలా చూసుకోండి. ఇలా చేస్తే పూర్వీకులు సంతోషిస్తారు..మీకు, మీ కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలని వారి ఆశీస్సులు అందిస్తారని చెబుతున్నారు. ఇంట్లో ఏవైనా దోషాలు ఉంటే, అది వ్యక్తి పూర్వీకుల కోపం ఫలితం కావచ్చు అని అర్థం చేసుకోండి. అందుచేత ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత బాగా స్నానం చేసి, పూర్వీకులకు తర్పణం చేసి వారి ఫోటోలకు పూల మాలలు వేసి నమస్కరించుకోండి. ఇది వారికి సంతోషాన్నివ్వటమే కాకుండా ఇంట్లో ఉన్న అన్ని దోషాలను తొలగిస్తుంది. మీ పూర్వీకుల వార్షికోత్సవాన్ని ప్రత్యేక పద్ధతిలో జరుపుకోండి. ఈ రోజున చేసే దానాలు, పూజలు వారికి సంతోషాన్నిస్తాయి.

మీ కుటుంబంపై పితృదోషం ఉన్నట్టుగా తేలితె మరణించిన కుటుంబ పెద్దలకు శాస్త్ర యుక్తంగా పిండ ప్రదానాలు, ఆర్థికలు క్రమం తప్పకుండా పాటించాలి. ఇలా చేస్తే..పితృదోషం తొలగిపోతుంది. పండితుల సలహా మేరకు దోష నివారణ పాటించాలి. పితృదోషం ఉంటే చిన్న వారు అకాలమరణం పొందుతారు. శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ కావటం, వారు ఆస్పత్రి పాలుకావడం వంటివి ఎదుర్కొవాల్సి వస్తుంది. అప్పులపాలు కావడం, అపనిందలు మోయడం కూడా కుటుంబంపై పితృదోశం ఉన్నవారు ఎదుర్కొవాల్సి ఉంటుందని జ్యోతిశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ ప్రమాదాలకు గురికావటం కూడా పితృదోశంగా గుర్తించాలంటున్నారు.

ఇవి కూడా చదవండి

పూర్వీకుల ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలంటే.. పితృపక్షంలో వారిని నిష్టగా పూజించాలి. ఈ ఏడాది సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్‌ 14న వరకు ఉంటుంది. ఈ 15 రోజుల సమయంలో చనిపోయిన పూర్వీకుల ఆశీర్వాదం కోసం అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో శ్రాద్ధ, తర్పణ, పిండదానం చేయాల్సి ఉంటుంది. పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పక్షుల రూపంలో ఇంటికొస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే భోజనం, నీరు వంటి ఏర్పాట్లు సదా చేసి ఉంచాలని సూచిస్తున్నారు.

Note: (ఇలాంటి సమాచారం, వాస్తు వివరాలు, రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం మనుషుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం.)

మరిన్ని ఆద్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..