అమెరికాలో హైదరాబాద్‌ విద్యార్థి మృతి.. చావు బతుకుల్లో మరో యువకుడు..! అగ్రరాజ్యంలో మనవాళ్లకు ఏమవుతుంది..?

ఇదిలా ఉంటే, స్టూడెంట్ వీసాపై 2023 ఆగస్టు 31న అమెరికా (యుఎస్) వెళ్లిన మహ్మద్ అమర్ గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అమర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ మేరకు అతని సోదరుడు, మహ్మద్‌ ముజాహెద్ వివరాలు వెల్లడించారు. అమర్‌ పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెప్పారు. అతను జార్జియాలోని అట్లాంటాలోని అట్రియం హెల్త్ నావిసెంట్ ది మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాట్టుగా పేర్కొన్నాడు.

Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 29, 2023 | 8:14 PM

USAలోని భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. మన దేశం నుంచి చదువు కోసం అమెరికా వెళ్లి విద్యార్థులు అనేక కష్టాలుపడుతున్నారు. తాజాగా అమెరికాలో మరో హైదరాబాద్‌ విద్యార్థి గుండెపోటుతో మరణించినట్టుగా తెలిసింది. 29 ఏళ్ల రేవంత్ అనే విద్యార్థి అమెరికాలో గుండెపోటుతో మృతి చెందాడు. మల్కాజిగిరి మారుతీనగర్‌కు చెందిన రేవంత్‌ ఇటీవల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. చికాగోలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదువుతున్నాడు. అతను కొన్ని నెలల క్రితమే అమెరికాకు వెళ్లాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి ఉంటున్న రేవంత్ గురువారం రాత్రి తీవ్ర గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. రేవంత్ అకాల మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు కోసం రెండు నెలల క్రితమే అమెరికాకు వెళ్లిన రేవంత్‌ మృతిపట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని భారత్‌కు తరలించే ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే, స్టూడెంట్ వీసాపై 2023 ఆగస్టు 31న అమెరికా (యుఎస్) వెళ్లిన మహ్మద్ అమర్ గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ అమర్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలిసింది. ఈ మేరకు అతని సోదరుడు, మహ్మద్‌ ముజాహెద్ వివరాలు వెల్లడించారు. అమర్‌ పరిస్థితి ఇంకా విషమంగా ఉందని చెప్పారు. అతను జార్జియాలోని అట్లాంటాలోని అట్రియం హెల్త్ నావిసెంట్ ది మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాట్టుగా పేర్కొన్నాడు.

అమర్‌ సోదరుడు మహ్మద్‌ ముజాహెద్‌ మాట్లాడుతూ.. కొన్ని వారాల క్రితం అమర్ దంతాలలో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా చెప్పాడు. ఆ తర్వాత అది అతని గొంతుకు వ్యాపించిందని చెప్పాడు. ఇండియానా వెస్లియన్ విశ్వవిద్యాలయం నుండి ఐటీలో మాస్టర్స్ (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్) చేయడానికి అమర్ US వెళ్ళాడు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న సమయంలో తన తమ్ముడితో ఎవరూ లేకపోవడం పట్ల అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. అమెరికా వెళ్లాలని ముజాహెద్ ప్లాన్ చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

యూఎస్‌లో హైదరాబాద్ విద్యార్థి జీవితంలో అత్యంత దారుణమైన ఇబ్బందులు ఎదుర్కోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా మరో హైదరాబాద్ విద్యార్థి, సయ్యదా లులు మిన్హాజ్, అమెరికాలోని చికాగో వీధుల్లో దారుణమైన పరిస్థితిలను ఎదుర్కొన్నారు.

జూలై 2023లో షాదన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన మిన్హాజ్, భారతదేశాన్ని విడిచిపెట్టడానికి ముందు మౌలా అలీ నివాసి, US వీధుల్లో ఆకలితో ఉన్న స్థితిలో కనిపించారు. ఆమె డెట్రాయిట్‌లోని TRINE యూనివర్సిటీ నుండి ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చేయడానికి US వెళ్ళింది. మొత్తం వస్తువులు చోరీకి గురికావడంతో డిప్రెషన్‌లో పడిపోయింది.

ఇకపోతే, ఇలాంటి వరుస సంఘటనలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళన పడుతున్నారు. తమ పిల్లలు కేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

నిరుద్యోగులకు పండగే.. ఈ రంగంలో లక్ష ఉద్యోగాలు రానున్నాయి..

రూల్స్ బ్రేక్ చేస్తున్న నయనతార.! ప్రభాస్ సినిమాలో స్పెషల్ సాంగ్..

భారత్‌లో రికార్డ్‌ సృష్టిస్తున్న యాపిల్‌ కంపెనీ..

బాలయ్యతో వన్స్‌మోర్.. ఆహా అన్‌స్టాపబుల్‌లో శ్రీలీల..

సినీ నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు.. వివాహితతో అక్రమ సంబంధం?

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్‌కి రంగం సిద్ధం

కరివేపాకుతో బరువు తగ్గడమే కాదు.. బోలెడు లాభాలు.. అవేంటో తెలుసా?

టెక్సాస్‌లో మరో హిందూ ఆలయం హరిహర క్షేత్రం.. తాత్కలికంగా బాలాలయం..

వామ్మో.! తుఫాన్ గండం.. ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

వేలానికి ముందు జీరో.. అమ్ముడైన వెంటనే సెంచరీ హీరో

టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.

దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..

ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.

ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్

ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!

కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!

వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు

రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!

నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.

కాబోయే భర్త ఎవరో చెప్పకనే చెప్పేసిన రష్మిక. ఫుల్‌ ఖుషీలో ఫ్యాన్స్