Andhra Pradesh: సాగర తీరంలో బెట్టింగ్‌ మాఫియా.. రూ.367 కోట్ల దందా.. ముఠాలో కీలక వ్యక్తులు..?!

Visakhapatnam: సాఫ్ట్‌వేర్‌ నిపుణులు వినియోగదారులను మోసం చేయడంతో పాటు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీలు గణనీయమైన లాభాలను నిర్ధారించడానికి ప్రత్యేకమైన యాప్ లను రూపొందించారట. ఈ మోసపూరిత యాప్ లు బెట్టింగ్‌లో కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలకి దారితీస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన ఇలాంటి స్కామ్ ల బారిన పడిన వారు తీవ్రమైన ఆర్థిక నష్టాలు, మానసిక క్షోభను కలిగిస్తున్నా ఆలాంటివాటిని ఆశ్రయించడం తప్పంటున్నారు పోలీస్ అధికారులు.

Andhra Pradesh: సాగర తీరంలో బెట్టింగ్‌ మాఫియా.. రూ.367 కోట్ల దందా.. ముఠాలో కీలక వ్యక్తులు..?!
Betting Gang
Follow us
Eswar Chennupalli

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 29, 2023 | 7:02 PM

విశాఖపట్నం,సెప్టెంబర్29: విశాఖ లో వెలుగుచూసిన 367 కోట్ల క్రికెట్ బెట్టింగ్ లావాదేవీల దందా ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలాచేసింది. కేవలం విశాఖ పరిసర ప్రాంతాల్లోనే ఇంత దందా జరిగిందంటే బెట్టింగ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్ళూనుకుని ఉందో మనకు ఇట్టే అర్దం అవుతుంది. ఈ కేసులో కేవలం 60 బ్యాంక్ ఖాతాల్లోనే ఇంత లావాదేవీలు జరిగితే మొత్తం వేల అకౌంట్లు ఉన్నాయని వాటిలో ఎంత లావాదేవీలు జరిగాయో అర్దం చేసుకోవచ్చు. మొత్తం 11 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేయగా మరికొందరు కీలక వ్యక్తుల కోసం పోలీస్ బృందాలు వేట కొనసాగిస్తున్నాయి. అక్షరాలా 367 కోట్లు, నిజమే. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఇంత డబ్బు బెట్టింగ్ లావాదేవీల్లో మారినట్టు అధికారులు బ్యాంక్ అకౌంట్ లను గుర్తించి 32 అకౌంట్స్ ను సీజ్ చేసి 72 లక్షలు సీజ్ చేశారు కూడా.

ఫిర్యాదు ఇలా..

నగరానికి చెందిన ఎర్ర సత్తిబాబు ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ఎనిమిది లక్షలు రూపాయలు నష్ట పోయాడు. అందులోనూ నష్టం వచ్చే విధంగా, అనగ ఒడిపోయే వైపు బెట్టింగ్ చేయించడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సత్తిబాబు సైబర్ క్రైమ్ పోలీసు వారిని ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ బెట్టింగ్’ ప్లాట్ఫారం వెనుక నగరం చెందిన పలువురు బుకీ లు ఉండడం తో వారిని అదుపులోనికి తీసుకోని వారికి సంభందించిన వివిధ బ్యాంక్ లో వున్న 63 బ్యాంక్ అక్కౌంట్స్ ఫ్రీజ్ చేశారు. వాటిలో 36 అక్కౌంట్స్ నుంచి వచ్చిన డేటా ప్రకారం రూ 367 కోట్ల 62 లక్షల 97 వేల 649 రూపాయలు లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. ఆ అక్కౌంట్స్ నుంచి 75 లక్షల రూపాయలు స్తంభింప చేసిన పోలీసులు, 11 మంది సూత్ర దారులను, బెట్టింగ్ కి పాల్పడుతున్న 12 మొబైలు ఫోన్ లు సీజ్ చేసినట్టు విశాఖ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ముఠాలో ప్రధాన ముద్దయి అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంకు చెందిన రెడ్డి సూరిబాబు గా గుర్తించారు. EXCH333, EXCH666, LORDS EXCH, GO. PUNT, Betway, Rajabets, 1XBet, Melbet, Parimatch, 22Bet, BetWinner, Dafabet వంటి ఎక్స్చేంజ్ ల ద్వారా సూరిబాబు బెట్టింగ్ ఆడడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అతను EXCH666 నుంచి ఆధరైజేషన్ తీసుకొని బెట్టింగ్ బుకి గా మారి ఎక్కువగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు, ఐపిఎల్ మ్యాచెస్ సమయంలో 20 నుంచి 30 మంది వ్యక్తుల వద్ద నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఒక్కొక్క మ్యాచ్ కి నాలుగు లక్షల రూపాయలు వరకు బెట్టింగ్ చేసేవాడు. ఇలా సంవత్సరానికి 5 నుంచి 6 కోట్లు బిజినెస్ టర్నోవర్ చేసేవాడు. ఇలా కలెక్ట్ చేసిన మొత్తాన్ని నగరం లో సూర్యభాగ్ కి చెందిన టూర్స్ అండ్ ట్రావెల్స్ నడిపిస్తున్న దినేష్ కుమార్ అలియాస్ మోను అనే వ్యక్తి కి పంపించేవాడు. ఇందుకు గాను అతనికి రెండు శాతం కమిషన్ ఇచ్చేవాళ్ళు.. ఈ విధంగా తనకి తెలిసిన వ్యక్తులను కూడా బుకీ లుగా మార్చి కమిషన్ కోసం బెట్టింగ్ నిర్వహించేవారు. అలా ఇరుజట్టులకి ఒక్కొక్క పర్సెంట్ ఇచ్చే వారు.

అంతా మోసమే..

గెలిచే అవకాశాలున్న జుట్టుకి తక్కువ పర్సెంట్ ఇస్తూ ఓడిపోయే జట్టుకి ఎక్కువ పర్సెంట్ ఇవ్వడం లాంటివి చేసే వారట. ఆ విధంగా ఒక జుట్టు మీద బెట్టింగ్ వేసిన తర్వాత వేరే జట్టు పైకి బెట్టింగ్ మార్చడానికి అవకాశం లేని విధంగా సర్వర్ ని ఆఫ్ చేస్తారు. ఉదాహరణకు ఒక జట్టు ఫేవరెట్ గా ఉన్న సందర్భంలో ఒక రూపాయికి 70 పైసలు ఇస్తూ వేరొక జట్టు 70 పైసలకు రూపాయి వచ్చేటట్లు యాప్ లో బెట్టింగ్ కి అవకాశం కల్పిస్తారు. ముఖ్యంగా ఈ ముఠా లో ప్రముఖ వ్యక్తులు బాల్ టు బాల్ బెట్టింగ్ ఆడుతున్న సమయంలో లేదా మ్యాచ్ గెలుస్తుందన్న సమయంలో వాళ్ళ స్వలాభం కోసం సదరు అప్లికేషన్ మరియు వెబ్సైట్ ని వాళ్ళు నచ్చిన విధంగా ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేత బాధితులు ఎక్కువగా నష్టపోవడం జరుగుతున్నట్టు పోలీస్ విచారణలో నిర్దారణ అయింది.

ఈ విషయం తెలియక ప్రజలు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టిన, ఆ గేమ్ యొక్క విన్, లాస్ ఆప్షన్స్ హ్యాండ్లర్ చేతుల్లో ఉండటం చేత లాస్ అయినట్టు చూపిస్తారు. ఒకవేళ గెలిచినప్పటికీ వాళ్ళ యొక్క ఖాతాల ID ని బ్లాక్ చేస్తారు. ఈ విధంగా నకిలీ పత్రాలను ఉపయోగించి ఓపెన్ చేసిన సేవింగ్స్ బ్యాంక్ మరియు కరెంట్ బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసిన డబ్బును శరవేగంగా వారి కార్పొరేట్ ఖాతాలకు బదిలీ చేస్తారు. రాకెట్ వెనుక పలువురు ప్రముఖులు ఈ రాకెట్ వెనుక వున్న ప్రధాన ముద్దాయిల కోసం గాలిస్తున్నట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు.

క్రికెట్ బెట్టింగ్ స్కామ్ విధానం..

ఈ మాఫియా రాకెట్, పందెం లేదా జూదం ఆడాలనుకునే కస్టమర్ల కోసం ID ల విక్రయం చేస్తుంటుంది. ఆన్లైన్ బెట్టింగ్లో చేరడానికి బుకీస్ వెబ్సైట్ కు సంబంధించిన లింక్ ను ముందు సోషల్ మీడియా లో పెడతారు… ఆ లింక్ ను ఉపయోగించి కస్టమర్లు ఈ ముఠా సృష్టించిన డమ్మీ వాట్సప్ నంబర్ అయిన లింక్ క్లిక్ చేయటం ద్వారా జూదం కోసం ఐడిని బుకీస్ దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు. బుకీలు వినియోగదారులను మానిప్యులేట్ చేయడానికి, అదే సమయంలో క్రికెట్ బెట్టింగ్లో పెద్ద లాభాలను నిర్ధారించడానికి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ఉపయోగిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, బుకీలు ఇతర క్రీడలలో జూదానికి విస్తరించేందుకు ఈ మోసపూరిత యాప్ లను రూపొందించడానికి సొంతంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులను కూడా నియమించుకుంటారట. ఈ అప్లికేషన్లు మొదట చిన్న విజయాలతో వినియోగదారులను ప్రలోభపెడతాయి, అయితే బుకీలు, బెట్టర్ యొక్క నైపుణ్యం స్థాయితో సంబంధం లేకుండా భారీ మొత్తం లో లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు. సాఫ్ట్వేర్ నిపుణులు ఈ ప్రోగ్రామ్లను అభివృద్ధి చేయడంతో పాటు వాటిని నిరంతరం కొత్త వెర్షన్లతో అప్డేట్ చేస్తారట. ఈ యాప్ లు అనధికారిక స్టోర్లలో లేదా షేర్ చేసిన లింక్ ల ద్వారా డౌన్లోడ్ చేయబడతాయి. డబ్బును పోగొట్టుకునే సమయంలో వినియోగదారులను కట్టిపడేసేందుకు బుకీలు సాంకేతిక నిపుణులను నియమిస్తారు. సాఫ్ట్వేర్ నిపుణులు వినియోగదారులను మోసం చేయడంతో పాటు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీల గణనీయమైన లాభాలను నిర్ధారించడానికి ప్రత్యేకమైన యాప్ లను రూపొందించారట. ఈ మోసపూరిత యాప్ లు బెట్టింగ్లో కోట్లాది రూపాయల మోసపూరిత లావాదేవీలకి దారితీస్తాయి. ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించిన ఇలాంటి స్కామ్ ల బారిన పడిన వారు తీవ్రమైన ఆర్థిక నష్టాలు, మానసిక క్షోభను కలిగిస్తున్నా ఆలాంటివాటిని ఆశ్రయించడం తప్పంటున్నారు పోలీస్ అధికారులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..