AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking: స్టీలు పాత్రలో వంట చేస్తున్నారా..? అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

ఎందుకంటే, ఇలాంటి స్టీలు పాత్రలను ఉపయోగించడానికి, శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి సులభంగా ఉంటాయి. అయితే ఐరన్, అల్యూమినియం ప్యాన్లలో వంట చేయడం ప్రమాదకరమని పలువురు నిపుణులు అంటున్నారు. అదేవిధంగా స్టీలు ప్యాన్లలో ఆహారాన్ని వండటం కూడా ప్రమాదకరమే అంటున్నారు. దాని ఉప్పు, నూనె పాన్ దిగువకు చేరి అడుగంటుతుంది. ఇది ఉప్పు నీటి మరకను ఏర్పరుస్తుంది. ఇక స్టీలు పాత్రలను పొయ్యిమీద కూడా పెట్టకూడదు.

Cooking: స్టీలు పాత్రలో వంట చేస్తున్నారా..?  అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
Food Prefare
Jyothi Gadda
|

Updated on: Sep 29, 2023 | 7:30 PM

Share

ఎలాంటి పాత్రల్లో వంట చేస్తే..మన ఆరోగ్యానికి మంచిది?? ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న ప్రశ్నలే ఇవి..ఇంటర్నెట్ సౌకర్యం అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత..తినే ఆహారం దగ్గర్నుంచి వండుకునే పాత్రల వరకు జనాలలో అవగాహన పెరిగింది. ఇక కరోనా అనంతరం ఆరోగ్యంపై ప్రజలు మరింత శ్రద్ధపెడుతున్నారు. ఇందులో భాగంగా మనకు అవసరమైనవి అవసరం లేనివి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు. అవన్నీ ఆచరించాలో, వదిలేయాలో తెలియక సందిగ్ధంలో పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు మనం వంటచేసే పాత్రలపై పడ్డారు జనాలు.. పూర్వకాలంలో ఆహారాన్ని వండడానికి మట్టి పాత్రలను ఉపయోగించేవారు. కానీ కాలం మారుతున్నా కొద్దీ మట్టి కుండల స్థానంలో స్టీలు, ఇనుము, అల్యూమినియం పాత్రలు వచ్చాయి. నేడు చాలా గృహాల్లో స్టీలు పాత్రలను ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే, ఇలాంటి స్టీలు పాత్రలను ఉపయోగించడానికి, శుభ్రం చేయడానికి, నిర్వహించడానికి సులభంగా ఉంటాయి. అయితే ఐరన్, అల్యూమినియం ప్యాన్లలో వంట చేయడం ప్రమాదకరమని పలువురు నిపుణులు అంటున్నారు. అదేవిధంగా స్టీలు ప్యాన్లలో ఆహారాన్ని వండటం కూడా ప్రమాదకరమే అంటున్నారు.

స్టీలు పాత్రల్లో వంట చేయడం వల్ల కలిగే నష్టాలు..

స్టీలు పాత్రల్లో ఆహారాన్ని వండడం వల్ల దాని కణాలు ఆహారంలోకి ప్రవేశిస్తాయి. స్టీల్ ప్యాన్ల అడుగు భాగం చాలా త్వరగా వేడెక్కుతుంది. కాబట్టి తక్కువ మంటలో ఎక్కువసేపు వండాల్సి వస్తుంది. ఇది హానికరం..అందుకే స్టీలు పాత్రల్లో ఆహారాన్ని వండకపోవడమే మంచిది. ఎందుకంటే స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉండటం స్టీల్ పాత్రలో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆహారంలో ఉండేటువంటి పసుపు గిన్నె అడుగుభాగానికి చేరుకొని జిగటగా మారుతుంది. ఒక స్టీల్ కంటైనర్‌ను దాని పొగ బిందువుకు మించి వేడి చేస్తే, అందులోని ట్రైగ్లిజరైడ్స్ విచ్ఛిన్నం అవుతాయి. తర్వాత అది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్‌గా మారుతుంది. అవి నీటిలో కరగవు. అంతేకాదు, మన పొట్టకు అనేక రకాల వ్యాధులను కలిగిస్తుంది. అంతేకాదు.. ఆ పాత్రను శుభ్రం చేయడం కూడా చాలా కష్టమవుతుంది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. కొన్ని రకాల వస్తువులను స్టీలు ప్యాన్లలో ఉడికించరాదు.. సాధారణంగా నూడుల్స్, పాస్తా, మాకరోనీలను స్టీల్ ప్యాన్లలో వండుతారు. దాని ఉప్పు, నూనె పాన్ దిగువకు చేరి అడుగంటుతుంది. ఇది ఉప్పు నీటి మరకను ఏర్పరుస్తుంది. ఇక స్టీలు పాత్రలను పొయ్యిమీద కూడా పెట్టకూడదు. తరచుగా మనం ఓవెన్‌లో స్టీలు ప్యాన్‌లను ఉంచుతాము. ఇది హానికరం, ప్రమాదకరమైనది. ఏదైనా లోహం విద్యుత్ కండక్టర్ కాబట్టి, షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..