AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నువ్వు మామూలోడివి కాదురా బాబు!..మేకల పశుగ్రాసం పేరుతో దశాబ్దాలుగా అదే వ్యాపారం..?

Rajanna Sircilla: చాలా ఏళ్లుగా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. స్థానికులకు కూడా అనుమానం రాకుండా.. ఈ మత్తు వ్యాపారం చేస్తున్నాడు. ఏడాది, ఆరునెళ్లుగా కాదు.. ఇతడు 40 ఏళ్లుగా గంజాయి సాగు చేస్తున్నాడు.. మేకల కోసం గడ్డి పెంచుతున్నాని స్థానికులను నమ్మించాడు.. పక్క సమాచారం తో పోలీసులు హైదర్ ఇంటిపై మెరుపు దాడి చేసి ఇంట్లో సోదాలు చేయగా ఒక చిన్న పాటి కవర్ లో

Telangana: నువ్వు మామూలోడివి కాదురా బాబు!..మేకల పశుగ్రాసం పేరుతో దశాబ్దాలుగా అదే వ్యాపారం..?
Cultivation Of Cannabis
G Sampath Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Sep 29, 2023 | 4:00 PM

Share

రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్29; మన దేశంలో జుగాడ్‌లకు కొదువే లేదు.. అలాగే, అక్రమ వ్యాపారాలు, అడ్డగోలు పాడు పనులు చేసేవాళ్లకు కూడా లేటు లేదు. గంజాయి, మత్తుపదార్థాల అమ్మకాలు, వినియోగంపై అధికారులు, పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేసినప్పటికీ కొందరు అక్రమార్కులు అందరి కళ్లు గప్పి యద్ధేచ్చగా తమ తప్పుడు కార్యకలాపాలను సాగిస్తున్నారు..బుర్రకో ఆలోచన అన్నట్లుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ వ్యక్తి ఇంట్లోనే గంజాయి సాగు చేపట్టాడు. గుట్టు చప్పుడు కాకుండా మేకల పశుగ్రాసం పేరుతో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. ఇతడు మామూలోడు కాదు.. గతేడాది, ఆరునెళ్లుగా కాదు.. ఇతడు 40 ఏళ్లుగా గంజాయి సాగు చేస్తున్నాడు.. మేకల కోసం గడ్డి పెంచుతున్నాని స్థానికులను నమ్మించాడు.. అతడు గంజాయి సేవించడం తో పాటు.. ఇతరులకు అమ్ముతున్నాడు.. చివరకు పోలీసులకు దొరికాడు ఈ మత్తు మనిషి. పూర్తి వివరాల్లోకి వెళితే..

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరా నగర్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను సాగు చేస్తున్న మొహమ్మద్ హైదర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందిరా నగర్లో ఉంటున్న హైదర్ తన ఇంటి ముందు మేకల కోసం వేసిన షెడ్డును అనుకొని వెనుకాల పాత ఇల్లు గోడల మధ్య ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి మొక్కలను సాగు చేస్తూ, సేవిస్తూ అమ్ముతున్నారు. చాలా ఏళ్లుగా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. స్థానికులకు కూడా అనుమానం రాకుండా.. ఈ మత్తు వ్యాపారం చేస్తున్నాడు.పక్క సమాచారం తో పోలీసులు హైదర్ ఇంటిపై మెరుపు దాడి చేసి ఇంట్లో సోదాలు చేయగా ఒక చిన్న పాటి కవర్ లో ఎండిన గంజాయి ఆకులు, హైదర్ సేవిస్తున్న పొగ గొట్టం స్వాధీనం చేసుకున్నారు. హైదర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చిన్న తనం నుండి గంజాయి చెట్లు పెంచుతున్నాడని తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి హైదర్ తన ఇంటి ముందు తనిఖీలు చేయగా ఈ తనిఖీల్లో ఇంటి వెనకాల సాగుచేసిన 31 గంజాయి మొక్కలు బయటపడ్డాయి. సిరిసిల్ల రూరల్ సీఐ, తంగళ్లపల్లి ఎస్సై వెంకటేశ్వర్లు, రెవెన్యూ అధికారులు మధు, భాస్కర్ పంచనామా నిర్వహించి మొక్కలను పైకీ వాటిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ఇతనిపై గతంలో గంజాయి విక్రయిస్తున్న కేసులు ఉన్నాయని తెలిపారు. హైదర్ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. మత్తు పదార్థాల సాగు, రవాణాకు పాల్పడితే సహించేది లేదని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల సిరిసిల్ల జిల్లాలో గంజాయి కేసు లు పెరుగుతున్నాయి. గంజాయి సాగు చేసిన, తాగిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు…