AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: మందలోంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు..! ఒకేసారి వెంటపడ్డ మూడు సింహాలు.. ఆ తర్వాత జరిగింది ఊహించలేం..!!

తమకు మంచి విందు భోజనం అనుకున్న సింహాలు ఒకదాని వెంట మరొకటిగా నిస్సహాయ పిల్ల ఏనుగును వెంబడించడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే సింహాలు తన వెంటపడటం గమనించిన ఏనుగు పిల్ల అప్రమత్తంగా వ్యవహరించింది. ఒకానొక సమయంలో ఏనుగు సింహాలను తరిమికొట్టడానికి వెనక్కి తిరిగింది. కానీ, సింహాలు ఏ మాత్రం తగ్గకుండా ఏనుగు పిల్లను వెంబడిస్తూనే ఉన్నాయి..దాంతో నడకలో కాస్త స్పీడ్ పెంచిన పిల్ల ఏనుగు.. ఎదురుగా ఉన్న గుబురు చెట్లల్లోకి వెళ్లి

Watch Viral Video: మందలోంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు..! ఒకేసారి వెంటపడ్డ మూడు సింహాలు.. ఆ తర్వాత జరిగింది ఊహించలేం..!!
Baby Elephant And Lions
Jyothi Gadda
|

Updated on: Sep 29, 2023 | 3:26 PM

Share

సోషల్‌ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అడవి జంతువులు, పెంపుడు జంతువులు, పాములు, పక్షులకు సంబంధించి చాలా వీడియోలు కనిపిస్తాయి. మనం గతంలో చూడని, చూడలేని వీడియోలను కూడా ఇంటర్‌నెట్‌ ప్రపంచం మన కళ్లముందుకు తెస్తుంది.ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్‌ అవుతుంది. అడవిలో మందలోంచి తప్పిపోయిన ఏనుగు పిల్ల ఒకటి తన తల్లి కోసం వెతుకుతోంది. ఇంతలో ఏనుగు పిల్లను ఒంటరిగా చూసిన మూడు సింహాలు ఏనుగును వెంబడించాయి. అదును చూసి ఏనుగుపై దాడి చేసేందుకు ఆ మూడు సింహాలు సిద్ధంగా ఉన్నాయి..ఆ తర్వాత ఏం జరిగింది..? పూర్తి వివరాల్లోకి వెళితే..

షాకింగ్ వైరల్ వీడియోలో మూడు సింహాలు పిల్ల ఏనుగును వెంబడిస్తూ వేటాడేందుకు సిద్ధపడ్డాయి. YouTube ఛానెల్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోని వాస్తవానికి దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో బ్రెంట్ ష్నప్ చిత్రీకరించారు. ప్రశాంతంగా ఉన్న అడవిలో మధ్యలో ఓ మగ సింహం మరో రెండు సింహాలతో కలిసి రోడ్డు దాటడం కనిపించింది. అంతలోనే ఒక పిల్ల ఏనుగు తన గుంపులోంచి తప్పిపోయి ఒంటరిగా వెళ్లటం సింహాల కంటపడుతుంది. ఆ మూడు సింహాలు పిల్ల ఏనుగును వెంబడించడం ప్రారంభించాయి.

వీడియోను చిత్రీకరించిన బ్రెంట్ ష్నప్ వివరణ ప్రకారణం..పరిస్థితిని పసిగట్టిన సింహాలు తల్లి ఏనుగు నుంచి తప్పిపోయిన పిల్ల ఏనుగు ఒంటరిగా ఉందని గ్రహించాయి. దాంతో తమకు మంచి విందు భోజనం అనుకున్న సింహాలు ఒకదాని వెంట మరొకటిగా నిస్సహాయ పిల్ల ఏనుగును వెంబడించడం ప్రారంభించాయి. ఈ క్రమంలోనే సింహాలు తన వెంటపడటం గమనించిన ఏనుగు పిల్ల అప్రమత్తంగా వ్యవహరించింది. ఒకానొక సమయంలో ఏనుగు సింహాలను తరిమికొట్టడానికి వెనక్కి తిరిగింది. కానీ, సింహాలు ఏ మాత్రం తగ్గకుండా ఏనుగు పిల్లను వెంబడిస్తూనే ఉన్నాయి..దాంతో నడకలో కాస్త స్పీడ్ పెంచిన పిల్ల ఏనుగు.. ఎదురుగా ఉన్న గుబురు చెట్లల్లోకి వెళ్లి మాయమైపోతుంది..అదృష్టవశాత్తూ సింహాలు దగ్గరకు రాకముందే పిల్ల ఏనుగు వాటికి కనిపించకుండా తప్పించుకోగలిగింది. అది ఎటు ఎళ్లిందో అర్థం కాక సింహాలు బిక్క ముఖం వేసుకోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ 26న షేర్ చేసిన ఈ వీడియోకు ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్‌ రాగా,1,000 కంటే ఎక్కువ లైక్‌లను పొందింది.

ఇవి కూడా చదవండి

సింహాలు, ఏనుగు పిల్ల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్ ఆన్‌లైన్ వీక్షకుల దృష్టిని ఆకర్షించింది. చాలా మంది వీక్షకులు తమ స్పందనలను కామెంట్ బాక్స్‌లో పంచుకున్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు. ఏనుగు పిల్ల చాలా చాకచక్యంగా వ్యవహరించింది. అందుకే మన వెనుక ఏం జరుగుతుందో ఎల్లప్పుడూ గమనించుకోవాలంటూ సూచించారు..” మరొకరు ఇలా వ్రాశారు. సింహాలు ఏనుగును వేటాడేందుకు రాలేదు..అవి ఆ పిల్ల ఏనుగును దాని గుంపుకు పంపడంలో సహాయం చేస్తున్నాయి.. ప్రజలు దానిని గ్రహించలేదని తాను భావిస్తున్నట్టుగా చెప్పాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..