AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అన్నగారిది పెద్ద ప్లానే.. ఫోటో చూస్తే రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోతారు..

Viral News: వేడుక ఏదైనా.. దరువు ఉండాల్సిందే.. గతంలో డప్పుల వాయిద్యాలు ఉండేవి.. ఇప్పుడు కాలం మారుతున్నా కొద్ది కొత్త రూపు సంతరించుకుని ప్రజలుకు మెస్మరైజింగ్ మ్యూజిక్‌ను వినిపించే ఇన్‌స్ట్రూమెంట్స్ వస్తున్నాయి. అలాగని.. అలనాటి వాయిద్యాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గడంలేదు.

Viral News: అన్నగారిది పెద్ద ప్లానే.. ఫోటో చూస్తే రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోతారు..
Drum Beat
Shiva Prajapati
|

Updated on: Sep 29, 2023 | 10:40 PM

Share

Viral News: వేడుక ఏదైనా.. దరువు ఉండాల్సిందే.. గతంలో డప్పుల వాయిద్యాలు ఉండేవి.. ఇప్పుడు కాలం మారుతున్నా కొద్ది కొత్త రూపు సంతరించుకుని ప్రజలుకు మెస్మరైజింగ్ మ్యూజిక్‌ను వినిపించే ఇన్‌స్ట్రూమెంట్స్ వస్తున్నాయి. అలాగని.. అలనాటి వాయిద్యాలకు ఏమాత్రం క్రేజ్ తగ్గడంలేదు. వాటి ఊపు, వాయింపు.. నెక్ట్స్ లెవల్ అని చెప్పాల్సిందే. ప్రస్తుత కాలంలో ప్రజలు ఏ వేడుక నిర్వహించినా.. డీజీ శబ్ధాలతో పాటు డప్పుల మోత ఉండాల్సిందే. డప్పుల దరువుకు చిన్న పిల్లలు మొదలు.. పండు ముసలి వరకు కాలు కదిపి చిందెయ్యాల్సిందే. అయితే, కొందరు ఈ డబ్బుల దరువును అద్భుతంగా వాయించినందుకు, తమ తమ సంతోషానికి కారణమైనందుకు తృప్తితో ఎంతో కొంత మొత్తం డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు అందుకున్న వాయిద్యకారుడు.. రెట్టించి ఉత్సాహంతో డబ్బులు వాయిస్తాడు. అయితే, ప్రస్తుతం అంతా డిజిటల్‌ చెల్లింపులే అయిపోయాయి. జేబులో ఎవరూ పెద్దగా డబ్బులు ఉంచుకోవడం లేదు. ఎక్కడికి వెళ్లినా జస్ట్ ఒక్క స్కాన్ చేసి లాగించేస్తున్నారు. దాంతో డప్పు వాయిద్య కారులు కాస్త నిరాశకు గురవుతున్నారు.

కానీ, కొందరుంటారు.. కాలం మారుతుంటే.. మనం ఎందుకు మారొద్దు? మనం ఎందుకు కాలానికి అనుగుణంగా ప్రయోగాలు చేయొద్దు అని ఆలోచిస్తారు. ఆలోచించడమే కాదు.. ఆచరణలో కూడా పెడతారు. ఇందుకు నిదర్శనమై ఘటనలు ఎన్నో మనం చూస్తుంటాం. సంక్రాంతి సంబరాలు వచ్చాయంటే.. హరిదాసులు గతంలో నడుచుకుంటూ ఇళ్లిల్లు తిరుగుతూ భిక్షాటన చేసేవారు. కానీ, ఇప్పుడు బైక్‌పై తిరుగుతూ స్టైల్ మార్చేశారు. ఇక డబ్బులిచ్చే వారి కోసం స్కానర్లను తమ వెంట పెట్టుకుంటున్నారు. ఎవరైనా డబ్బులు లేవని మొబైల్ చూపిస్తే.. వెంటనే స్కాన్ చేయాల్సిందిగా ఆ స్కానర్లను తీసి చూపిస్తున్నారు. ఇంకేముంది.. ఆ విధంగానూ వారికి రాబడి వచ్చేస్తోంది. అచ్చం ఇలాంటి ప్రయోగమే ఓ డబ్బు కళాకారుడు చేశాడు. ఓ డ్రమ్మర్ తన డ్రమ్‌కి స్కానర్‌ను ఏర్పాటు చేశాడు. ఎవరైనా బహుమతి ఇవ్వాలనుకుంటే.. ఆ స్కానర్‌కు జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సదరు డ్రమ్మర్ ఫోటోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. అతని ప్రయోగాన్ని చూసి నెటిజన్లు అవాక్కయ్యారు. ఇది నిజంగా అద్భుతం అని ప్రశంసలు కురిపిస్తున్నారు. కాలానుగణంగా మార్పు ఉండాలని, అతను ఆలోచనకు సెల్యూట్ అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో నగదు గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, అందుకే తాను డిజిటల్ థింక్ చేశాడని కామెంట్ పెడుతున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా.. అతనికి నిజంగా సలాం చెప్పాల్సిందే.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..