- Telugu News Photo Gallery World Heart Day 2023: These Yoga Poses will be helpful to keep heart healthy and fit
World Heart Day 2023: ప్రతి రోజూ ఉదయాన్నే ఈ యోగాసనాలు చేస్తే చాలు.. మీ చిట్టి గుండె సేఫ్..
World Heart Day 2023: మానవ జీవిత విధానం, ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పులు కారణంగా అనేక మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా మానవాళిని వెంటాడుతున్న ఆరోగ్య సమస్యల్లో గుండె సంబంధిత జబ్బులదే ప్రథమ స్థానం. ఈ కారణంగానే గుండెపోటు, హార్ట్ స్ట్రోక్, ఇతర హృదయ సంబంధిత సమస్యలతో మరణించేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది.
Updated on: Sep 29, 2023 | 10:42 PM

అయితే జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే గుండెను కాపాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇందులో భాగంగానే ప్రతి రోజూ కొన్ని రకాల యోగాసనాలు చేయాలి. ఆయా ఆసనాల కారణంగా గుండె పనితీరు మెరుగుపడి, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. ఇంతకీ ఆ ఆసనాలు ఏమిటంటే..?

భుజంగాసనం: గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆసనాల్లో భుజంగాసనం ప్రముఖమైనది. దీన్ని కోబ్రా భంగిమ అని కూడా అంటారు. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటమే కాక శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఇంకా వెన్నునొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

తడసనా: ప్రతిరోజూ ఉదయం తడసనా చేయడం వల్ల మీ హృదయ స్పందన మెరుగుపడుతుంది, అలాగే రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. ఈ యోగాసనం గుండె వైఫల్యంతో బాధపడేవారి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

వృక్షాసనం: ఉదయం లేవగానే వృక్షాసనం వేయడం వల్ల మన శరీరానికి స్థిరత్వం, సమతుల్యత లభిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరానికి మరెన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

వీరభద్రాసనం: గుండెకు మేలు చేసే మరో ఆసనం వీరభద్రాసనం. దీనిని యోధుల భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేస్తున్నప్పుడు, కాళ్ల మధ్య ఖాళీని ఏర్పరుచుకుంటూ నేలపై నిలబడి యోగా చేస్తారు. ఈ యోగాసనం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.





























