Konaseema: కంద దుంపకు అరటి గెల.. వీరబ్రహ్మం కాలజ్ఞానంలో చెప్పినట్టు జరిగిందంటూ పూజలు..

ఐ.పోలవరం మండలం తిళ్ళకుప్ప గ్రామంలో వేగిరాజు సుబ్బరాజు ఇంటి ఆవరణలో కంద దుంపకు అరటి గెల వేసింది రెండు కేజీల బరువైన కంద దుంప భూమిలోపల పెరిగింది. దాని నుంచి విచిత్రంగా ఒక అడుగు ఎత్తు కాండం పైకి వచ్చింది. దానికి అరటిగెల వేసింది. అచ్చం అరటిగెలకు ఎలా అయితే అస్తాలు ఉంటాయో అదే విధంగా గెలనిండా అరటికాయల అస్తాలతో చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

Konaseema: కంద దుంపకు అరటి గెల.. వీరబ్రహ్మం కాలజ్ఞానంలో చెప్పినట్టు జరిగిందంటూ పూజలు..
Viral News
Follow us
Pvv Satyanarayana

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 29, 2023 | 2:09 PM

అంబేద్కర్‌ కోనసీమజిల్లాలో వింతఘటన చోటుచేసుకుంది. ఓ రైతు ఇంటి ఆవరణలో కంద దుంపకు అరటిగెల వేసింది. ఈ విచిత్రాన్ని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా చుట్టుపక్కల ప్రాంతాలవారికి కూడా తెలియడంతో ఈ వింతను చూసేందుకు జనం పోటెత్తుతున్నారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టే జరుగుతోందని చర్చించుకుంటున్నారు.

ఐ.పోలవరం మండలం తిళ్ళకుప్ప గ్రామంలో వేగిరాజు సుబ్బరాజు ఇంటి ఆవరణలో కంద దుంపకు అరటి గెల వేసింది రెండు కేజీల బరువైన కంద దుంప భూమిలోపల పెరిగింది. దాని నుంచి విచిత్రంగా ఒక అడుగు ఎత్తు కాండం పైకి వచ్చింది. దానికి అరటిగెల వేసింది. అచ్చం అరటిగెలకు ఎలా అయితే అస్తాలు ఉంటాయో అదే విధంగా గెలనిండా అరటికాయల అస్తాలతో చూపరులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఉదయం ఇంటిముందు పెరటిలో ప్రత్యక్షమైన ఈ వింతను చూసి ఆ కుటుంబంలోని వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. చుట్టుపక్కలవారుసైతం పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది దైవ ఘటనగా భావించి ఆ అరటి గెలను దుంపతో సహా తవ్వి తీసుకెళ్లి ఇంట్లో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. కంద దుంప కు అరటి గెల వేసిందని ఆనోట ఈనోట ప్రచారం కావడంతో చుట్టు ప్రక్కల గ్రామాల నుండి ఘటనాస్థలికి పెద్దసంఖ్యలో క్యూకడుతున్నారు. అరటిచెట్టుకు మొక్కి పూజలు చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పినట్టుగా ఇలాంటి సంఘటన తమ గ్రామంలో చోటుచేసుకోవడం ఆనందంగా ఉందని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..