- Telugu News Photo Gallery Spiritual photos Vastu tips: Keeping these 5 things at your main gate can bring prosperity and wealth in telugu
Vastu Tips: మీ ప్రధాన ద్వారం వద్ద ఈ 5 వస్తువులను ఉంచడం లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
వాస్తు శాస్త్రం ఇంట్లోని, జీవితంలోని మంచి చెడులను నిర్ధారించే శాస్త్రం. ఇది ఒక శాస్త్రం కాబట్టి.. అమలు చేయడం చాలా ఆచరణాత్మకమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద కొన్ని నియమాలు పాటించినట్లు అయితే జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అంతేకాదు జీవితంలో ఆర్థిక వృద్ధి, సిరి, సంపదలు నెలకొనేలా చేస్తాయి.
Updated on: Sep 29, 2023 | 8:29 AM

దైవం ఆశీర్వాదం కోసం మీ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద లక్ష్మీ పాదాలను స్టిక్కర్లగా అతికిస్తారు. ఇలా చేయడం ఇంటి సంపద, శ్రేయస్సు పెరుగుదలను నిర్ధారిస్తుంది. ఈ పాదాలను ఇంటి వద్ద ఏర్పాటు చేసుకోవడం దైవం అనుగ్రహం ఆ ఇంటిపై ఉంటుంది. అంతేకాదు గ్రహ కదలికలను, దుష్ప్రభావాలను కూడా తగ్గిస్తుంది.

వాస్తు ప్రకారం ఒక గాజు గిన్నెలో నిండుగా నీరు పోసి.. అందులో కొన్ని పూల రేకులను ఏర్పాటు చేయడం మంచిది. ఇలా చేయడం వలన సంపద, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. ఇంటి ప్రవేశ ద్వారం కూడా అందంగా చూపరులను ఆకట్టుకునేలా ఉంటుంది. నీరు.. వేడి, విద్యుత్తులకు వ్యతిరేక వాహకం.. కనుక ఇంటిలోప్రతికూల శక్తిని అడ్డుకునే వాహకంగా నీరు పనిచేస్తుంది. కుటుంబ సభ్యులు మంచి ఆరోగ్యంతో ఉంచేలా సహాయపడుతుంది.

ఇంటికి ఇతర తలుపుల కంటే పెద్ద ప్రవేశ ద్వారం ఉంటే.. అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. తలుపు సవ్యదిశలో తెరిస్తే, అది ప్రతికూల శక్తిని తగ్గిస్తుంది. ఇంట్లోకి వెలుతురు వచ్చేలా తలుపులు కొంచెం ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి.

పండగలు, శుభకార్యాల సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి తోరణాలను వేలాడదీస్తారు. భారతీయ గృహాల ద్వారాలకు మామిడి, రావి లేదా అశోక్ చెట్టు ఆకులతో తయారు చేసిన తోరణాలను వేలాడదీస్తారు. ఇలా చేయడం వలన ఇంటిలోని ప్రతికూలతను అరికడుతుందని విశ్వాసం. ఆకులు ఎండిపోయిన తర్వాత మీరు వాటి స్థానంలో కొత్త వాటితో మార్చవచ్చు. ఈ ఆకులు ప్రతికూల ప్రకంపనలను గ్రహిస్తాయి. చెడు ద్రుష్టి నుండి ఇంటిని రక్షించడానికి ఉత్తమం అని విశ్వాసం.

ఇంటి ప్రవేశద్వారం వద్ద స్వస్తిక్ ను ఏర్పాటు చేసుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇది అదృష్టం, శ్రేయస్సును తెస్తుంది. స్వస్తిక్ వ్యాధిని, దుఃఖాన్ని కూడా తగ్గిస్తుంది. ఆనందం, శ్రేయస్సును పెంచుతుంది





























