- Telugu News Photo Gallery Spiritual photos Shukra gochar 2023: venus transit in leo to bring good luck for these zodiac signs news in Telugu
Venus Transit: సింహరాశిలోకి శుక్ర గ్రహం ప్రవేశం.. వారి కలలు సాకారం చేయనున్న శుక్రుడు.. !
Venus Transit in Leo: ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, శారీరక సుఖాలకు కారకుడైన శుక్రుడు సింహరాశిలో ఎంతో హుందాగా వ్యవహరిస్తాడు. ఈ శుక్రుడిని తొమ్మిదవ స్థానం నుంచి గురువు, సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడు వీక్షిస్తున్నందువల్ల ఈ గ్రహ కారకత్వాలలో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. వివిధ రాశులకు సింహరాశి శుక్రుడి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ పరిశీలిద్దాం.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Sep 29, 2023 | 6:59 PM

అక్టోబర్ 2న శుక్ర గ్రహం కర్కాటక రాశి నుంచి మళ్లీ సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ రాశిలో ఈ గ్రహం నెల రోజులు ఉంటుంది. కొద్ది కాలం సింహరాశిలో సంచరించిన శుక్రుడు వక్రించి కర్కాటకంలోకి వెళ్లిపోవడం జరిగింది. ఇప్పుడు వక్రగతి పోయి, మళ్లీ సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రేమలు, పెళ్లిళ్లు, శృంగారం, శారీరక సుఖాలకు కారకుడైన శుక్రుడు సింహరాశిలో ఎంతో హుందాగా వ్యవహరిస్తాడు. ఈ శుక్రుడిని తొమ్మిదవ స్థానం నుంచి గురువు, సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడు వీక్షిస్తున్నందువల్ల ఈ గ్రహ కారకత్వాలలో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. వివిధ రాశులకు సింహరాశి శుక్రుడి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ పరిశీలిద్దాం.

మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల ప్రేమ వ్యవహారాలు కొత్త పుంతలు తొక్కు తాయి. ప్రేమ జీవితాన్ని అనుభవించడంలో కొత్త రకం ఆలోచనలు, అభిప్రాయాలు చోటు చేసు కుంటాయి. వినూత్న ప్రదేశాలకు విహార యాత్రలు చేయడం జరుగుతుంది. ఎక్కువగా పర్వత ప్రాంతాలు, లోయ ప్రాంతాలను విహార యాత్రలకు ఎంపిక చేసుకుంటారు. పంచమంలో ఉన్న శుక్రుడిని గురు, శనులు వీక్షిస్తున్నందువల్ల ఈ ప్రేమలు అతి త్వరలో పెళ్లికి దారితీసే అవకాశం ఉంది.

వృషభం: ఈ రాశివారికి నాలుగవ స్థానంలో శుక్రుడు సంచరించడం, దాన్ని గురు, శనులు బలంగా వీక్షించడం వల్ల వృత్తి, ఉద్యోగాలలో సహచరులతో ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. సాధారణ పరిచయం నుంచి ప్రేమలోకి దిగిపోవడం జరుగుతుంది. సాధారణంగా ప్రేమ వ్యవహారాలకు పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో భారీగా ఖర్చయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రేమలు వచ్చే ఏడాది పెళ్లికి దారితీసే అవకాశం ఉంది.

మిథునం: ఈ రాశివారికి మూడవ స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల ప్రయాణాల్లో స్త్రీలతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ప్రారంభం కావడానికి మరి కొంత కాలం పట్టవచ్చు. ఈ శుక్రుడిని శని, గురులు వీక్షించడం వల్ల పరిచయాల విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిం చాల్సి ఉంటుంది. భారీగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది. కొన్ని అనవసర పరిచయాల వల్ల ఇబ్బందులు పడే సూచనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి ప్రేమ కల సాకారం అయ్యే అవకాశం లేదు.

కర్కాటకం: ఈ రాశివారికి ద్వితీయ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల ప్రేమ జీవితం నుంచి పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో శుక్ర సంచారం వల్ల ఏర్పడిన పరిచయాలు, ప్రేమలు శుక్రుడు సింహరాశి ప్రవేశంతో మూడు ముళ్లకు దారితీసే సూచనలున్నాయి. ప్రేమ భాగ స్వామికి భారీగా కానుకలు, వస్త్రాభరణాల కొనివ్వడం వంటివి జరుగుతాయి. ఈ శుక్రుడి మీద గురు, శనుల దృష్టి పడి నందు వల్ల ప్రేమ వ్యవహారాలు బట్టబయలయ్యే అవకాశం ఉంటుంది.

సింహం: ఈ రాశిలోనే శుక్ర గ్రహ సంచారం జరగబోతున్నందువల్ల ప్రేమ వ్యవహారాల్లో కొత్తగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. బాగా పరిచయస్థులతో ప్రేమ వ్యవహారాలు ప్రారంభం అయ్యే సూచనలు న్నాయి. తనకంటే వయసులో పెద్ద అయిన వ్యక్తులతో ప్రేమాయణం సాగించడం జరుగుతుంది. స్థానిక ప్రదేశాలను ప్రేమ వ్యవహారాలకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. భాగ్యస్థానం నుంచి గురువు, సప్తమ స్థానం నుంచి శనీశ్వరుడు వీక్షించడం వల్ల ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీస్తుంది.

కన్య: ఈ రాశికి 12వ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల ఈ రాశివారు ప్రస్తుతానికి ప్రేమ లేక శృంగార వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ప్రేమల వల్ల భారీగా నష్టపోవడం, ఇబ్బందులకు గురి కావడం వంటివి జరిగే అవకాశం ఉంది. అనవసర పరిచయాలు విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. సింహరాశి శుక్రుడి మీద గురు, శనుల వీక్షణ వల్ల ఈ రాశివారికి మహిళా సహచరుల నుంచి, ఇతర స్త్రీల నుంచి కష్టనష్టాలు ఎదురయ్యే సూచనలున్నాయి.

తుల: ఈ రాశివారికి లాభ స్థానంలో శుక్ర సంచారం ప్రారంభం అవుతున్నందువల్ల మహిళలతో పరిచ యాలు పెరిగే అవకాశాలున్నాయి. ప్రేమ వ్యవహారం దృఢతరం అవుతుంది. మహిళా సహచరు లతో పాటు ఇతరత్రా కూడా మహిళలతో సాన్నిహిత్యం ఏర్పడడం, భారీగా ఖర్చు అవుతుండడం వంటివి జరుగుతాయి. ప్రకృతి సౌందర్యం కలిగిన ప్రాంతాలకు విహార యాత్రలకు, ప్రేమ యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. శని, గురువుల వీక్షణ వల్ల ప్రేమ వ్యవహారం కచ్చితంగా పెళ్లికి దారి తీస్తుంది.

వృశ్చికం: ఈ రాశివారికి దశమ స్థానంలో శుక్ర గ్రహ సంచారం వల్ల మహిళా సహచరులతో గానీ, సంపన్న కుటుంబానికి చెందిన మహిళతో గానీ ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. గురు, శనుల వీక్షణ కారణంగా మొదట్లో కొద్దిగా ఒడిదుడుకులున్నప్పటికీ కాలక్రమంలో ప్రేమ వ్యవహారం పటిష్టమవు తుంది. సాధారణంగా మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాలను ప్రేమ యాత్రలకు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ప్రేమలు పెళ్లిగా మారే అవకాశం ఉంది.

ధనుస్సు: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడి ప్రవేశం వల్ల, దాన్ని రాశినాథుడైన గురువు వీక్షిస్తు న్నం దువల్ల తప్పకుండా ప్రేమ వ్యవహారాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. మొదటి చూపు లోనే ప్రేమ అంకురించే సూచనలు కూడా ఉన్నాయి. పరిచయస్థులతో ప్రేమాయణం ప్రారంభం అవుతుంది. సాధారణంగా సంపన్న కుటుంబానికి చెందిన మహిళతో ప్రేమలో పడడం జరుగు తుంది. ఇద్దరి మధ్యా అతి స్వల్పకాలంలోనే వివాహ బంధం ఏర్పడే సూచనలున్నాయి.

మకరం: అష్టమ స్థానంలో ప్రవేశిస్తున్న శుక్రుడి కారణంగా ఈ రాశివారు కొత్తగా ప్రేమ వ్యవహారాల్లో దిగే అవకాశం ఉండదు. గతంలో ప్రారంభమైన ప్రేమ వ్యవహారాలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోయే అవకాశం ఉంటుంది. శని, గురు గ్రహాల వీక్షణ కార ణంగా ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బంది పడే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఆచితూచి వ్యవహ రించడం మంచిది. ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి ఈ ఏడాది పెళ్లయ్యే అవకాశం ఉండక పోవచ్చు.

కుంభం: ఈ రాశివారికి సప్తమ రాశిలోకి శుక్రుడి ప్రవేశం వల్ల తప్పకుండా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది. ఈ రాశి నుంచి శుక్రుడి మీద శనీశ్వరుడి వీక్షణ వల్ల మనసులోని మాట బయటకు రావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఈ ప్రేమ వ్యవహారాలు కూడా చాలావరకు నత్త నడక నడిచే సూచనలున్నాయి. ఈ ప్రేమలు వచ్చే ఏడాది మే తర్వాతే ఫలవంతం అవుతాయని చెప్పవచ్చు. ఈ శుక్రుడి మీద శని, గురు గ్రహాల వీక్షణ వల్ల అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి.

మీనం: ఈ రాశివారికి ఆరవ స్థానంలో శుక్ర గ్రహ ప్రవేశం వల్ల ప్రేమ వ్యవహారాలకు ప్రయత్నాలు జరిగే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ప్రేమల్లో పడినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. చాలాకాలం క్రితమే ప్రేమల్లో పడినవారు కూడా వీలైనంత ‘దూరం జరిగే’ అవకాశం ఉంది. మహిళ లతో ప్రేమలు, పరిచయాలకు సంబంధించినంత వరకూ ప్రస్తుతానికి ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ఈ శుక్రుడి మీద గురు, శనుల వీక్షణ ఈ రాశివారికి ఏ మాత్రం అనుకూలంగా లేదు.





























