Guntur: రోడ్డుమీద గుంతల్లో వర్షపు నీరు.. ప్రమాదాలు జరగకుండా స్టూల్స్ వేసి అప్రమత్తం చేసిన స్థానికులు

గుంతలో పడి వాహనాదారులకి దెబ్బలు తగులుతున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. ఏంచేయాలో అర్ధం కాలేదు. దీంతో ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ స్టూల్స్ ను తీసుకొచ్చి ఆ గుంతలో కనపడేటట్లు పెట్టారు. అంతేకాదు స్టూ్ల్స్ కి దూరం నుండి కూడా కనపడేలా పచ్చని చెట్లు కొమ్మలు పెట్టారు. దీంతో దూరం నుండి వచ్చే వాహనదారులకి కనపడేలా చేశారు.

Guntur: రోడ్డుమీద గుంతల్లో వర్షపు నీరు.. ప్రమాదాలు జరగకుండా స్టూల్స్ వేసి అప్రమత్తం చేసిన స్థానికులు
Potholes On The Road
Follow us

| Edited By: Surya Kala

Updated on: Sep 29, 2023 | 1:29 PM

రోడ్డుపై వరుసగా  స్టూల్స్ వేశారు ఏంటా అనుకుంటున్నారా.. .పెళ్ళికో ఫంక్షన్లకు భోజనాలు పెట్టడానికి వేసిన స్టూల్స్ కాదు అవి… రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త కోసం వేసిన స్టూల్స్ అవి. వరస రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తమ వంతు ప్రయత్నంగా గ్రామస్థుల చేస్తున్న ప్రయత్నాలు ఇవి.. ఈ స్టూల్స్ ఎక్కడ, ఎందుకు వేశారా అని అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గుంటూరు జిల్లా కాకుమాను మండలం.. మండలం కేంద్రం కావడంతో ప్రతి రోజూ ఎంతోమంది వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వస్తుంటారు. అయితే ప్రధాన రహదారి అంతా కూడా గుంతలమయింగా మారింది. పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. గుంతలు పూడ్చమని అనేకసార్లు అధికారులకు గ్రామస్థులు  విన్నవించుకున్నారు. అయినా లాభం లేకపోయింది. మరోవైపు వివిధ గ్రామాల నుండి మండల కేంద్రానికి వస్తున్న వాహనదారులు ఈ గుంతల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. రెండు రోజుల క్రితం వర్షం పడటంతో ఆ గుంతల్లోకి నీరు చేరింది.

దీంతో గుంతలో పడి వాహనాదారులకి దెబ్బలు తగులుతున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు గమనించారు. ఏంచేయాలో అర్ధం కాలేదు. దీంతో ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ స్టూల్స్ ను తీసుకొచ్చి ఆ గుంతలో కనపడేటట్లు పెట్టారు. అంతేకాదు స్టూ్ల్స్ కి దూరం నుండి కూడా కనపడేలా పచ్చని చెట్లు కొమ్మలు పెట్టారు. దీంతో దూరం నుండి వచ్చే వాహనదారులకి కనపడేలా చేశారు. గుంతలు పడిన రోడ్డు వద్ద పెద్ద మలుపు కూడా ఉండటంతో వాహనదారులకి తెలిసేలా స్థానికులు స్టూల్స్ ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

దీనిపై వివిధ ప్రాంతాల నుండి కాకుమాను వచ్చే ప్రయాణీకులు స్థానికులకు అభినందనులు తెలుపుతున్నారు. అధికారులు పట్టించుకోకపోయిన స్థానికులు ముందస్తుగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీసం మరమ్మత్తులైనా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..