AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: గణేష్ నిమజ్జన ఊరేగింపులో పోకిరీల వికృత చేష్టలు..! డ్యాన్సర్ డ్రెస్ లాగి అసభ్య..

గణేష్ నిమజ్జనంలో డాన్స్ చేయడానికి వచ్చిన మహిళా డాన్సర్ల పట్ల కొందరు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి సమయంలో యువతి డ్రెస్ లాగి ఇబ్బందులకు గురిచేశారు. దీంతో బాధిత యువతి దిశ SOSకు కాల్ చేసి సహాయం కోరింది. కేవలం ఎనిమిది నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతికి రక్షణ కల్పించారు. అల్లరి చేస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని, డ్యాన్స్ గ్రూప్ సభ్యులను సురక్షితంగా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలు దీనికి..

Andhra Pradesh: గణేష్ నిమజ్జన ఊరేగింపులో పోకిరీల వికృత చేష్టలు..! డ్యాన్సర్ డ్రెస్ లాగి అసభ్య..
Hooligans Misbehaved With Female Dancer
M Sivakumar
| Edited By: Srilakshmi C|

Updated on: Sep 29, 2023 | 12:08 PM

Share

బందరు, సెప్టెంబర్‌ 29: పొట్టకూటి కోసం డాన్స్ వేసే మహిళల పట్ల కొందరు ఆకతాయిలు చెడుగా ప్రవర్తించారు. వినాయక నిమజ్జన ఊరేగింపులో వారి డ్రస్సులు లాగి అసభ్యకర చేష్టలు చేసారు. మద్యం మత్తులో డాన్సర్లను ఆకతాయిలు వేధించారు. తట్టుకోలేని డాన్సర్లు దిశా యాప్ ను ఆశ్రయించగా పోలీసులు వారికి రక్షణగా నిలిచారు. ఈ ఘటన ఎక్కడో కాదు‌ కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాలేంటో ఒకసారి చూడండి..

గణేష్ నిమజ్జనంలో డాన్స్ చేయడానికి వచ్చిన మహిళా డాన్సర్ల పట్ల కొందరు పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. అర్ధరాత్రి సమయంలో యువతి డ్రెస్ లాగి ఇబ్బందులకు గురిచేశారు. దీంతో బాధిత యువతి దిశ SOSకు కాల్ చేసి సహాయం కోరింది. కేవలం ఎనిమిది నిముషాల వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతికి రక్షణ కల్పించారు. అల్లరి చేస్తున్న పోకిరీలను అదుపులోకి తీసుకొని, డ్యాన్స్ గ్రూప్ సభ్యులను సురక్షితంగా ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అసలు దీనికి సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే…

విజయవాడకు చెందిన ఐదు మంది సభ్యులు గల డాన్స్ గ్రూప్ బందరులో జరిగే వినాయక నిమజ్జనంలో డాన్స్ చేయడానికి వెళ్లారు. ఈ డాన్స్ గ్రూప్ లో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు వున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో డాన్స్ గ్రూప్ లోని ఓ యువతి పట్ల స్థానికంగా వుండే కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. బాధిత యువతి డ్రెస్ లాగి ఇబ్బందులకు గురిచేశారు. డాన్స్ గ్రూప్ లోని ఇతర సభ్యులు అడ్డుకోవడంతో పోకిరీలు రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో బాధిత యువతి దిశ యాప్ కు వీడియో కాల్ చేసి ఫిర్యాదు చేసింది.

ఇవి కూడా చదవండి

బాధిత యువతి దిశ SOSకు కాల్ చేసిన ఎనిమిది నిముషాల వ్యవధిలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాధిత యువతికి ధైర్యం చెప్పి భరోసాను కల్పించారు. ఊరి పెద్దమనుసులు జ్యోక్యం చేసుకొని పోకిరి యువకులను మందలించారు. బాధిత యువతి, ఇతర డాన్సర్ల సూచన మేరకు అల్లరి చేసిన యువకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అనంతరం డాన్స్ గ్రూప్ లోని సభ్యులకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి విజయవాడ కు క్షేమంగా పంపించారు. తాము సురక్షితంగా ఇంటికి చేరే వరకు దిశ మహిళా సిబ్బంది ఫోన్ లో టచ్ లో ఉన్నారని బాధిత యువతి సంతోషం వ్యక్తం చేసింది. ఆపదలో ఉన్నామని దిశ యాప్ కు కాల్ చేసిన నిముషాల వ్యవధిలోనే తమను రక్షించిన దిశ పోలీసులకు బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.