Nashik Mobile Blast: పెద్ద శబ్దంతో బాంబులా పేలిన మొబైల్‌ ఫోన్‌.. ఇళ్ల కిటికీలు, కార్ల అద్దాలు ధ్వంసం!

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ప్రతాప్‌నగర్‌లోని సిడ్కో ప్రాంతంలో ఓ ఇంట్లో తుషార్‌ జగ్‌తాప్‌, శోభా జగ్‌తాప్‌, బాలకృష్ణ సుతార్‌ అనే ముగ్గురు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో బుధవారం (సెప్టెంబర్‌ 27) చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. పేలుడు ధాటికి ఇంటి ఆవరణలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు, కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటన జరిగిన ఇంట్లో నిసాసం ఉంటోన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా..

Nashik Mobile Blast: పెద్ద శబ్దంతో బాంబులా పేలిన మొబైల్‌ ఫోన్‌.. ఇళ్ల కిటికీలు, కార్ల అద్దాలు ధ్వంసం!
Nashik Mobile Blast
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 28, 2023 | 8:45 AM

నాశిక్‌, సెప్టెంబర్ 28: మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ప్రతాప్‌నగర్‌లోని సిడ్కో ప్రాంతంలో ఓ ఇంట్లో తుషార్‌ జగ్‌తాప్‌, శోభా జగ్‌తాప్‌, బాలకృష్ణ సుతార్‌ అనే ముగ్గురు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వీరి ఇంట్లో బుధవారం (సెప్టెంబర్‌ 27) చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్ధంతో పేలింది. పేలుడు ధాటికి ఇంటి ఆవరణలో పార్క్ చేసిన వాహనాల అద్దాలు, కిటికీలు కూడా ధ్వంసమయ్యాయి. చుట్టుపక్కల ఇళ్ల అద్దాలు, తలుపులు కూడా దెబ్బతిన్నాయి. ఈ ఘటన జరిగిన ఇంట్లో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నాసిక్ జిల్లాలోని ఉత్తమ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మొబైల్‌కు ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలో పక్కనే ఉంచిన పెర్ఫ్యూమ్‌ బాటిల్‌ వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాంబ్‌ మాదిరి పేలిన ఈ మొబైల్‌ ఫోన్‌ బ్లాస్ట్‌ ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది.

ఫోన్ పేలుడు విషాదాలు ఎన్నో..

ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళలోని త్రిస్సూర్‌లో 3వ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలిక చేతిలో మొబైల్ ఫోన్ పేలి మరణించిన సంఘటన తెలిసిందే. బాలిక ఫోన్‌లో వీడియో చూస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరో ఘటనలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఓ వ్యక్తి ఛార్జింగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో వ్యక్తి (68 ఏళ్లు) ముఖం, ఇతర శరీర భాగాలు తీవ్రంగా గాయపడ్డాయి. మృతుడు ఫోన్ ఛార్జింగ్ మోడ్‌లో ఉండగా మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఇక గత ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ బ్యాటరీ పేలడంతో ఎనిమిది నెలల చిన్నారి మరణించింది. నిత్యం చేతిలో ఫోన్‌ పట్టుకుని తిరిగే జనాలు ఈ సంఘటనతో బెంబేలెత్తిపోతున్నారు. బాంబ్‌ను జేబులో పెట్టుకుని తిరుగుతున్నామేమోనని సందేహం కలవర పెడుతోంది. చిన్న మొబైల్‌ ఫోన్‌ ఇంతటి విధ్వంసాన్ని సృష్టించడం వెనుక అసలు కారణాలు ఏమైవుంటాయో తెలియక ఆందోళన చెందుతున్నారు.

అసలేందుకు ఫోన్‌లు పేలుతాయంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొబైల్ ఫోన్‌ను ఛార్జర్‌కి కనెక్ట్ చేసినప్పుడు అది వేడిని ఉత్పత్తి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫోన్‌ ఉష్ణోగ్రతలు పెరిగి పేలుడుకి దారి తీస్తాయి. ఛార్జింగ్ మోడ్‌లో మొబైల్ ఫోన్‌ల లిథియం-అయాన్ బ్యాటరీ వేడెక్కుతుంది. ఇది స్మార్ట్‌ఫోన్ పేలడానికి గల ప్రధాన కారణాలలో ముఖ్యమైనది.

ఇవి కూడా చదవండి

మొబైల్ ఫోన్‌లు ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఉపయోగించకూడదని పలుమార్లు హెచ్చరిస్తుంటారు. అలాగే మొబైల్‌ను కొనుగోలు చేసినప్పుడు దానితోపాటు ఇచ్చిన ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించాలి. అలాగే గంటల తరబడి ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచకూడదు. చాలా మంది ఫోన్‌ను రాత్రిళ్లు ఛార్జ్‌ చేసి తెల్లారేంత వరకూ అలాగే ఉంచుతారు. ఇది ఎంత మాత్రం మంచిపని కాదు. ఫోన్‌ బ్యాటరీ ఉబ్బినట్లు అనిపిస్తే దానిని వినియోగించకపోవడం మంచిదని నిపుణులు సలహాయిస్తున్నారు. చార్జింగ్‌ పెట్టిన ఫోన్‌ను తలగత కింద పెట్టకూడదు. ఫోన్‌ చార్జింగ్‌లో ఉన్నప్పుడు వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచడం మంచిదని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.