How to Get Rid of Cavities: క్యావిటీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ప్రతి రోజూ ఇలా చేయండి..
చిన్న వయసులోనే అనేక మంది రకరకాల దంత సమస్యలతో బాధపడుతుంటారు. అందులో క్యావిటీ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో బాధపడుతుంటారు. దీని వల్ల పళ్లలో చిన్న రంధ్రాలు ఏర్పడతాయి. ఈ సమస్య ప్రధానంగా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అందుకే దంతాలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటున్నారు నిపుణులు. పళ్ల సంరక్షణకు, అలాగే పంటి ఎనామిల్ పాడవకుండా ఉండటానికి ఈ కింది జాగ్రత్తలు తీసుకోండి..
Updated on: Sep 27, 2023 | 12:44 PM

ఆహారంలోని చిన్న చిన్న కణాలు దంతాలలో పేరుకుపోయి బ్యాక్టీరియా పుట్టుకకు కారణం అవుతాయి. స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ అనే బ్యాక్టీరియా దంత క్షయానికి కారణమవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ తినవచ్చు. ఎందుకంటే ఈ రకమైన గమ్‌లో స్ట్రెప్టోకోకస్ మ్యూటాన్స్ పెరగకుండా నిరోధించే సమ్మేళనం ఉంటుంది. ఇది దంతాల ఎనామిల్‌ను కూడా రక్షిస్తుంది.

దంతాల సంరక్షణకు విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్ అవసరం. విటమిన్ డి దంతాలలో కావిటీలను నివారించడంలో సహాయపడుతుంది. అందుకే విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఫ్లోరైడ్ దంతాలను కావిటీస్ లేకుండా ఉంచుతుంది. ఇది దంతాల ఎనామెల్ తరిగిపోకుండా కాపాడుతుంది. కాబట్టి ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌ను ఎల్లప్పుడూ వినియోగించాలి.

అంతేకాకుండా పచ్చి వెల్లుల్లి మిమ్మల్ని క్యావిటీ సమస్యల నుంచి కూడా కాపాడుతుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ పదార్థాలు పలు రకాల దంత సమస్యల నుంచిడి ఉపశమనం కలిగిస్తుంది.

దంత సమస్యలను దూరం చేయడానికి ఉప్పునీటిని కూడా ఉపయోగించవచ్చు. ఉప్పు నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఉప్పునీరు నోటి లోపల ఆమ్లం, pH సమతుల్యతను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఉప్పు నీళ్లను క్రమంతప్పకుండా పుక్కిలించడం వల్ల కూడా పుచ్చులు తొలగిపోతాయి.