- Telugu News Photo Gallery Cinema photos With the Telugu industry becoming a carafe for Indian cinema, music directors are also looking forward to mingling in Tollywood.
Music Directors: టాలీవుడ్ పై కన్నేసిన పరభాషా సంగీత దర్శకులు.. ఇప్పుడు వాళ్ళదే హావా..
ఒకప్పుడు అదర్ లాంగ్వేజెస్ నుంచి హీరోయిన్లు మాత్రమే వచ్చేవారు. తరువాత విలన్లు రావటం మొదలైంది. ఇప్పుడు టెక్నీషియన్స్ కూడా క్యూ కడుతున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ, ఇండియన్ సినిమాకు కేరాఫ్‌గా మారటంతో సంగీత దర్శకులు కూడా టాలీవుడ్‌లో మింగిల్ అయ్యేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో మలయాళ మ్యూజిక్ ట్రెండ్ అవుతోంది. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ హృదయం సినిమాతో పాపులర్ అయిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ హాట్ ఫేవరెట్‌గా మారారు.
Dr. Challa Bhagyalakshmi - ET Head | Edited By: Prudvi Battula
Updated on: Sep 27, 2023 | 12:47 PM

ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలో మలయాళ మ్యూజిక్ ట్రెండ్ అవుతోంది. మాలీవుడ్ బ్లాక్ బస్టర్ హృదయం సినిమాతో పాపులర్ అయిన హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ హాట్ ఫేవరెట్‌గా మారారు. రీసెంట్ హిట్ ఖుషీతో పాటు అప్ కమింగ్ మూవీస్ హాయ్ నాన్న, స్పార్క్, శర్వా 35 సినిమాలకు సంగీతమందిస్తున్నారు హేషమ్.

కన్నడ సెన్సేషన్ కేజీఎఫ్ సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసిన రవి బసూర్ టాలీవుడ్‌లో కూడా బిజీ అవుతున్నారు. ప్రజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్ సినిమాకు సంగీతమందిస్తున్నారు రవి. సల్మాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమాలో తెలుగు బతుకమ్మ పాటకు సంగీతమందించింది కూడా రవి బసూరే.

కోలీవుడ్ నుంచి కూడా సంగీత దర్శకులు టాలీవుడ్ వైపు వస్తున్నారు. చిన్నప్పటి నుంచే టాలీవుడ్‌తో టచ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్. నటుడిగా, సంగీత దర్శకుడిగా కోలీవుడ్‌లో ఫుల్ బిజీగా ఉన్నా... అప్పుడప్పుడూ తెలుగు వైపు కూడా చూస్తున్నారు ఈ యంగ్ మ్యూజీషియన్. రీసెంట్‌గా సర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జీవీ... ప్రజెంట్ టైగర్ నాగేశ్వరరావు, నితిన్ - వెంకీ కుడుముల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

మరో సౌత్ సెన్సేషన్ సంతోష్ నారాయణన్ కూడా టాలీవుడ్‌లో పాగా వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. గురు సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న సంతోష్... దసరా సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రజెంట్ గ్లోబల్ మూవీ కల్కి 2898 ఏడీ తో పాటు వెంకీ సైంధవ్ సినిమాలకు సంగీతమందిస్తున్నారు సంతోష్ నారాయణన్.

మాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగీత దర్శకుడు గోపీ సుందర్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌కు కేరాఫ్‌గా మారిన గోపీ... భలే భలే మొగాడివోయ్, ప్రేమమ్, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు సంగీతమందించారు. ఇప్పుడిప్పుడే టాలీవుడ్‌ను కమ్మేస్తున్న మరో మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్. ఇప్పటికే అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న అనిరుధ్, ప్రజెంట్ ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీకి స్వరాలందిస్తున్నారు.





























