ఎయిర్ ఇండియా నుంచి చీర ట్రెండ్ కనుమరుగు.. ఎయిర్ హోస్టెస్‌లకు డిజైనర్ డ్రెస్..!
ఇకపై ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఇకపై చీరకట్టుతో కనిపించరు..ఇది పూర్తిగా కనుమరుగు కానుంది.. ఇక్కడ రెడీ-టు-వేర్ చీరలు, ఇంకా అనేక ఎంపికలు వచ్చాయి. రెడీ-టు-వేర్ చీరలు చీరల వలే కనిపిస్తాయి. అయితే వాటిని పాలకవర్గం ఖరారు చేయలేదు. కొత్త యూనిఫారాలు ఎయిర్ ఇండియా సిగ్నెచర్ శైలిని ప్రతిబింబిస్తాయని,
విమానయాన రంగంలో అనేక మార్పులు, ఆధునికతకు తెరలేపినప్పటికీ ఎయిర్ ఇండియా మాత్రమే తన విమాన సిబ్బందికి ఆధునిక దుస్తులకు బదులుగా సంప్రదాయ చీరలను ధరించడం కొనసాగించింది. కానీ, ఇప్పుడు ఎయిర్ ఇండియా తిరిగి టాటా సన్స్ గొడుగు కిందకు వచ్చింది. దీని తర్వాత ఎయిర్ హోస్టెస్ ల చీర ట్రెండ్ మారే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త యుగానికి అనుగుణంగా ఎయిర్ ఇండియా తన విమాన సిబ్బంది కోసం కొత్త రకాల యూనిఫామ్‌లను ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇటీవలి నివేదిక ప్రకారం, ఎయిర్ ఇండియా తన మహిళా సిబ్బంది యూనిఫాంను మార్చాలని చూస్తోంది. సాంప్రదాయకంగా, ఎయిర్‌లైన్ ఫ్లైట్ అటెండెంట్‌లు ఆరు దశాబ్దాలకు పైగా చీరలు ధరిస్తున్నారు. అయితే ఈ చిరకాల ట్రెండ్ వచ్చే నవంబర్ నాటికి మారుతుందని, దానికి బదులు ఆధునిక రకాల యూనిఫారాలు వస్తాయని చెబుతున్నారు.
కంపెనీ మహిళా సిబ్బంది కోసం డిజైనర్ చుడీదార్లను, పురుషుల కోసం డిజైనర్ సూట్లను డిజైన్ చేస్తుంది. నివేదికల ప్రకారం, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ కొత్త యూనిఫాంలను డిజైన్ చేయనున్నారు. అయితే, ఎయిరిండియా, మనీష్ మల్హోత్రా మధ్య కుదిరిన నాన్-డిస్క్‌లోజర్ ఒప్పందం కారణంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు.
అనేక ఎంపికలలో మహిళా సిబ్బందికి చుడీదార్లు ప్రధాన ఎంపిక. పురుష సిబ్బంది కోసం సూట్లు ఎంపిక చేసినట్టుగా సంబంధిత వర్గాల సమాచారం. ఇకపై ఎయిర్ ఇండియా మహిళా సిబ్బంది ఇకపై చీరకట్టుతో కనిపించరు..ఇది పూర్తిగా కనుమరుగు కానుంది.. ఇక్కడ రెడీ-టు-వేర్ చీరలు, ఇంకా అనేక ఎంపికలు వచ్చాయి. రెడీ-టు-వేర్ చీరలు చీరల వలే కనిపిస్తాయి. అయితే వాటిని పాలకవర్గం ఖరారు చేయలేదు. కొత్త యూనిఫారాలు ఎయిర్ ఇండియా సిగ్నెచర్ శైలిని ప్రతిబింబిస్తాయని, ముదురు ఎరుపు, బంగారు రంగులను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. ఎయిర్ ఇండియాతో విలీన ప్రక్రియ పూర్తయిన తర్వాత, విస్తారా ఎయిర్‌లైన్స్ కూడా ఈ యూనిఫాంను స్వీకరించే అవకాశం ఉంది.
#ThisDayThatYear On 18 April 1971 Air India received delivery of its first #Boeing747. And we had this most elegant line-up at BOM airport to welcome her. Our ladies carried their uniform sarees with so much of poise & grace which is unmatched in the history of civil aviation!💕 pic.twitter.com/6MHPhSDj56
— BiTANKO BiSWAS (@Bitanko_Biswas) April 18, 2020
కొత్త ఎయిర్‌బస్ A350 ఎయిర్‌క్రాఫ్ట్ రాక తర్వాత ఎయిర్‌లైన్ కొత్త రూపాన్ని ఆవిష్కరిస్తామని, ఇది అక్టోబర్ లేదా నవంబర్‌లో రావచ్చని ఎయిర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. అయితే, ఈ మార్పును ఎయిరిండియా సిబ్బంది ఎవరూ ధృవీకరించలేదు.
JRD టాటా ఎయిర్ ఇండియా మహిళా సిబ్బందికి చీరను పరిచయం చేశారు. 1962లో సంప్రదాయ చీరను ఎయిర్‌మెన్‌లకు పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఎయిర్ ఇండియా ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది. ఎయిర్ ఇండియా మొదట్లో బిన్నీ మిల్స్ నుంచి ఈ చీరలను కొనుగోలు చేస్తుండేది. నేటికీ, ఎయిర్ ఇండియా ఫ్లైట్ అటెండెంట్‌లు సంప్రదాయ చీర లేదా అదే రంగు ప్యాంటుతో కూడిన ట్యూనిక్ ధరించి కనిపిస్తుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..