- Telugu News Photo Gallery Karnataka CM Siddaramaiah says Will challenge CWRC's order to release Cauvery water to TN in SC
Cauvery Row: కావేరి జలాలపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తాం: సిద్దరామయ్య
తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ జలాలు విడుదల చేయాలంటూ కావేరీ జల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. ధవారం మాలె మహదేశ్వర హిల్స్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య... తమవద్ద చాలినంత నీరు లేదని జల నియంత్రణ కమిటీకి ఇప్పటికే నివేదికను సమర్పించామని.. అలాగే సెప్టెంబర్ 25వ తేదీ నాటికి కావేరీ బేసిన్‌లోని నాలుగు రిజర్వాయర్ల ఇన్‌ఫ్లో చాలా తక్కువగా ఉందన్నారు.
Updated on: Sep 27, 2023 | 9:02 PM

తమిళనాడు, కర్ణాటక మధ్య కావేరీ జలాల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ జలాలు విడుదల చేయాలంటూ కావేరీ జల నియంత్రణ కమిటీ జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.

బుధవారం మాలె మహదేశ్వర హిల్స్‌లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన సీఎం సిద్దరామయ్య... తమవద్ద చాలినంత నీరు లేదని జల నియంత్రణ కమిటీకి ఇప్పటికే నివేదికను సమర్పించామని.. అలాగే సెప్టెంబర్ 25వ తేదీ నాటికి కావేరీ బేసిన్‌లోని నాలుగు రిజర్వాయర్ల ఇన్‌ఫ్లో చాలా తక్కువగా ఉం అన్నారు. అలాగే వాటి సామర్థ్యంలో 53.04 మాత్రమే ఉందని పేర్కొన్నారు.

ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో గత 123 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా తక్కువగా వర్షాపాతం నమోదైందని పేర్కొన్నారు. అలాగే 12 వేల క్యూసెక్కుల నీటిని.. విడుదల చేయాలంటూ కావేరి జల నియంత్రణ కమిటిని అభ్యర్థించగా.. సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 15 వరకు రోజుకు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కమిటీ కర్ణాటకకు ఆదేశించినట్లు తెలిపారు.

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు చాలా తక్కువగా వర్షాలు పడటం వల్ల తాగునీటీ సమస్యలు ఉన్నా.. ఆ నీటిని వ్యవసాయానికి మాత్రమే సమకూర్చుకోగలుగుతున్నామని అన్నారు.

తమిళనాడు ప్రభుత్వం మొత్తం 12వేల క్యూసెక్కుల నీటిని రిలీజ్ చేయాలని కోరగా.. 3 వేల క్యూసెక్కులు విడుదల చేస్తే సరిపోతుందన్న.. సీడబ్ల్యుఆర్‌సీ ఆదేశాలపై సంతృప్తి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.





























